Movie News

రెండు క్రేజీ సీక్వెల్స్.. ఒరిజిన‌ల్ హీరోలు లేకుండా

గ‌త పాతికేళ్ల‌లో త‌మిళం నుంచి వ‌చ్చిన ఉత్త‌మ ద‌ర్శ‌కుల్లో సెల్వ రాఘ‌న‌వ్ పేరు త‌ప్ప‌కుండా ఉంటుంది. త‌న త‌మ్ముడు ధ‌నుష్‌ను హీరోగా పెట్టి అత‌ను తీసిన కాద‌ల్ కొండేన్ అప్ప‌ట్లో త‌మిళ‌నాట సంచ‌ల‌నం రేపింది. ఇక 7-జి బృందావ‌న కాల‌నీ సినిమా అటు త‌మిళంలోనే కాక ఇటు తెలుగులోనూ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఇవే కాక ఆయుర‌త్తిల్ ఒరువ‌న్ (యుగానికి ఒక్క‌డు), పుదుపేట (ధూల్ పేట‌), ఆడువారి మాట‌ల‌కు అర్థాలే వేరులే లాంటి క్లాసిక్స్ అత‌డి ఖాతాలో ఉన్నాయి.

కానీ గ‌త ద‌శాబ్ద కాలంగా సెల్వ రాఘ‌వ‌న్ స్థాయికి త‌గ్గ సినిమాలు తీయ‌ట్లేదు. అస‌ల‌త‌ను ద‌ర్శ‌కుడిగా సినిమాలే బాగా త‌గ్గించేశాడు. న‌టుడిగా కొంచెం బిజీ అయ్యాడు. ప్ర‌స్తుతం సెల్వ 7-జి బృందావ‌న కాల‌నీ సీక్వెల్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇది కాక అత‌ను రెండు క్రేజీ సీక్వెల్స్‌కు రంగం సిద్ధం చేస్తున్నాడు. అవే.. ఆయుర‌త్తిల్ ఒరువ‌న్-2, పుదుపేట్ట‌-2.

ఈ రెండు చిత్రాల కోసం కొన్నేళ్ల నుంచి బ్యాగ్రౌండ్ వ‌ర్క్ చేస్తున్నాడు సెల్వ రాఘ‌వ‌న్. ఒక టైంలో ఆయుర‌త్తిల్ ఒరువ‌న్ సీక్వెల్‌ను ధ‌నుష్ హీరోగా అనౌన్స్ చేశాడు. కానీ అది ధ‌నుష్ హీరోగా ఆయ‌న తీసిన వేరే సినిమాను ప్ర‌మోట్ చేసుకోవ‌డానికే అని త‌ర్వాత తేలింది. కార్తితోనే ఆ సీక్వెల్ తీస్తే బాగుంటుంద‌నే అభిప్రాయాలు స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌య్యాయి. మ‌రోవైపు ధ‌నుష్ హీరోగా పుదుపేట్ట‌-2 కోసం ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. కానీ సెల్వ త‌న పాటికి తాను ఆ స్క్రిప్టులు రెడీ చేస్తున్నాడు కానీ.. ఆ హీరోలిద్దరూ ఈ సినిమాలు చేసే సంకేతాలు కనిపించ‌డం లేదు.

చివ‌రికి స్వయంగా సెల్వ‌నే ఈ సీక్వెల్స్ విష‌యంలో ఒక క్లారిటీ ఇచ్చేశాడు. తాను ఆ రెండు చిత్రాల‌కు స్క్రిప్టులు రెడీ చేస్తున్నాన‌ని.. కొన్నేళ్లుగా వ‌ర్క్ జ‌రుగుతోంద‌ని.. కానీ కార్తి, ధ‌నుష్ ప్ర‌స్తుతం త‌మ క‌మిట్మెంట్ల‌తో బిజీగా ఉండ‌డం వ‌ల్ల ఈ సినిమాల‌ను వేరే హీరోల‌తో తెర‌కెక్కించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాన‌ని చెప్పాడు సెల్వ‌. ఐతే తాము ఖాళీగా లేక‌పోవ‌డం కంటే సెల్వ ఫామ్ దెబ్బ తిన‌డం వ‌ల్లే కార్తి, ధ‌నుష్ అత‌డితో సినిమాలు చేయ‌డానికి ముందుకు రాలేక‌పోతుండొచ్చ‌నే చర్చ జ‌రుగుతోంది. మ‌రి ఈ క్రేజీ సీక్వెల్స్ ఎప్పుడు, ఎవ‌రితో ముందుకు క‌దులుతుందో చూడాలి.

This post was last modified on October 24, 2025 9:50 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 minutes ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

3 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

6 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

9 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

9 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

11 hours ago