ప్రదీప్ రంగనాథన్.. ఈ పేరు చెబితే అటు తమిళనాడు యువతే కాక.. తెలుగు రాష్ట్రాల యూత్ కూడా వెర్రెత్తిపోతున్నారు. కేవలం తన కోసమే థియేటర్లకు కదలుతున్నారు. తన నటన, స్టైల్ అన్నీ యూత్‌కు బాగా కనెక్ట్ అవుతున్నాయి. తన సినిమాల్లో కంటెంట్ కూడా బలంగా ఉంటుండడంతో బాక్సాఫీస్ దగ్గర వరుసగా జయకేతనం ఎగురవేస్తున్నారు. చాలా వేగంగా అతను స్టార్ ఇమేజ్ సంపాదించాడు. చూస్తుండగానే మిడ్ రేంజ్ హీరోల్లో ఒకడిగా ఎదిగిపోయాడు.
కానీ అతను అరంగేట్రం చేసింది మాత్రం నటుడిగా కాదు.. దర్శకుడిగా. జయం రవి హీరోగా అతను కోమాలి అనే కామెడీ మూవీ తీశాడు. ఆ సినిమా ఓ మాదిరిగా ఆడింది. తర్వాత కొన్నేళ్లు అతను కనిపించలేదు. తర్వాత తనే హీరోగా లవ్ టుడే అనే సినిమా చేశాడు. తమిళంలో పెద్ద నిర్మాణ ఏజీఎస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోయి నటుడిగా, దర్శకుడిగా ప్రదీప్‌కు మంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. ఈ చిత్రం కొంచెం లేటుగా తెలుగులోనూ విడుదలై ఇక్కడా విజయం సాధించింది.
ప్రదీప్ ఎవరికీ పరిచయం లేకపోయినా.. కేవలం కంటెంట్ బలంతో లవ్ టుడే రూ.100 కోట్ల వసూళ్లు సాధించడం విశేషం. అది ఫ్లూక్ హిట్ అనుకునే అవకాశం లేకుండా.. హీరోగా తన రెండో చిత్రం డ్రాగన్‌తో ఇంకా పెద్ద హిట్టు కొట్టాడు ప్రదీప్. ఆ చిత్రం ఏకంగా రూ.140 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీని తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో కొత్త దర్శకుడు కీర్తీశ్వరన్ రూపొందించిన డ్యూడ్‌లో నటించాడు ప్రదీప్. ఈ సినిమాకు ఎబోవ్ యావరేజ్ టాక్ వచ్చింది. అయినా ప్రదీప్ తన ఆకర్షణతో సినిమాను నిలబెట్టాడు. ఇది కూడా వంద కోట్ల క్లబ్బులో అడుగు పెట్టేసింది. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ సినిమా హిట్ అనిపించుకుంది.
డెబ్యూ నుంచి వరుసగా మూడు చిత్రాలతో వంద కోట్ల వసూళ్లు సాధించిన హీరో ఇప్పటిదాకా ఇండియాలో ఎవ్వరూ లేరు. పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చే వారసత్వ హీరోలకు కూడా ఇది సాధ్యపడలేదు. ఇది ఎంత పెద్ద ఘనత అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డిసెంబరులో ప్రదీప్ కొత్త చిత్రం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ రాబోతోంది. దానికీ పాజిటివ్ టాక్ వచ్చి వరుసగా నాలుగో వంద కోట్ల సినిమా.. ఏడాదిలో మూడు సెంచరీ మూవీతో ప్రదీప్ కొత్త రికార్డు నెలకొల్పుతాడేమో చూడాలి.
This post was last modified on October 24, 2025 9:47 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…