ఒకప్పుడు విరామం లేకుండా సినిమాలు చేస్తూ.. అడపాదడపా హిట్లు కొడుతూ ఉండేవాడు శర్వానంద్. కానీ 2022లో ‘ఒకే ఒక జీవితం’తో ఓ మోస్తరు ఫలితాన్ని అందుకున్నాక అనూహ్యంగా అతడి కెరీర్లో పెద్ద గ్యాప్ వచ్చేసింది. రెండేళ్ల పాటు తన నుంచి సినిమానే రిలీజ్ కాలేదు. ఈ విరామం తర్వాత గత ఏడాది ‘మనమే’ సినిమాతో పలకరించాడు శర్వా. కానీ ఆ సినిమా అతడికి నిరాశనే మిగిల్చింది.
ఈ ఏడాది శర్వా నుంచి రిలీజే లేదు. అంటే మూడేళ్ల వ్యవధిలో కేవలం ఒక్క రిలీజ్‌తో సరిపెట్టాడు శర్వా. ఒక యంగ్ హీరో కెరీర్లో ఇలాంటి గ్యాప్ రావడం తన కెరీర్‌కు తీవ్ర ఇబ్బంది కలిగించే విషయమే. ఐతే ఈ గ్యాప్‌నంతా వచ్చే ఏడాది కవర్ చేసేయబోతున్నాడు శర్వా. 2026లో అతడి సినిమాలు మూడు రిలీజయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి.
‘సామజవరగమన’ దర్శకుడు రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శర్వా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘నారీ నారీ నడుమ మురారి’ వచ్చే సంక్రాంతికి షెడ్యూల్ అయింది. ఆ సీజన్లోనే సినిమా వస్తుందా లేదా అనే సందేహాలున్నాయి. కానీ పండక్కి మిస్ అయినా ఇంకో నెలరోజుల్లోపే సినిమా విడుదలయ్యే అవకాశముంది. ఇక వేసవికి ‘బైకర్’ సినిమాతో పలకరించబోతున్నాడు శర్వా.
‘లూజర్’ వెబ్ సిరీస్ దర్శకుడు అభిలాష్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. శర్వాకు కెరీర్లో ఇదొక వెరైటీ ఫిలిం అవుతుందని భావిస్తున్నారు. మరోవైపు శర్వా ‘భోగి’ అనే ఊర మాస్ సినిమా ఒకటి చేస్తున్నాడు. దానికి సంపత్ నంది దర్శకుడు. ఆ సినిమా సైలెంటుగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో విడుదలయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు శ్రీను వైట్ల దర్శకత్వంలోనూ శర్వా ఒక సినిమా చేయబోతున్నాడు కానీ.. అది వచ్చే ఏడాది రాకపోవచ్చు. 2026లో శర్వా నుంచి మూడు రిలీజ్‌లు ఉండడం మాత్రం పక్కా.
This post was last modified on October 23, 2025 4:16 pm
ప్రపంచం మొత్తంలో ఉన్న ఫిలిం మేకర్స్ ఆరాధనాభావంతో చూసే దర్శకుడు జేమ్స్ క్యామరూన్. అవతార్ అనే ఊహాతీత లోకాన్ని సృష్టించి…
బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ‘యురి: ది సర్జికల్ స్ట్రైక్’ దర్శకుడు ఆదిత్య ధర్ స్వీయ నిర్మాణంలో…
తెలుగు సినీ పరిశ్రమలో అనుకోని విషాదం చోటు చేసుకుంది. ఒక యువ దర్శకుడు హఠాత్తుగా కన్నుమూశాడు. తన పేరు కిరణ్…
వైసీపీ అధినేత జగన్ పై సీఎం చంద్రబాబు మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో మెడికల్ కాలేజీలను పబ్లిక్ ప్రైవేట్…
2009లో ప్రపంచ సినీ చరిత్రలోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచిన చిత్రం ‘అవతార్’. ఆ సినిమాకు కొనసాగింపుగా ఏకంగా…
1997లో విడుదలైన బోర్డర్ ఒక క్లాసిక్ మూవీ. 1971 ఇండియా పాకిస్థాన్ యుద్ధాన్ని నేపథ్యంగా తీసుకుని దర్శకుడు జెపి దత్తా…