Movie News

మీడియాను ఆకాశానికెత్తేసిన‌ బండ్ల గ‌ణేష్

న‌టుడు, నిర్మాత‌ బండ్ల గణేష్ చేతికి మైక్ అందితే చాలు.. అంద‌రి అటెన్ష‌న్ త‌న వైపు తిప్పుకుంటాడు. ఆయ‌న ఎవ‌రిఐనా పొగిడినా, తెగిడినా అది టాప్ గేర్‌లోనే ఉంటుంది. గ‌త నెల లిటిల్ హార్ట్స్ స‌క్సెస్ మీట్‌కు వ‌చ్చి ఆ టీం మీద ప్ర‌శంస‌లు కురిపిస్తూనే.. కొంద‌రు ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖుల మీద పంచ్‌లు వేసి వార్త‌ల్లో వ్య‌క్తిగామారాడు గ‌ణేష్‌. ఆ త‌ర్వాత ఇటీవ‌లే త‌న ఇంట్లో ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖుల‌కు ఇచ్చిన దీపావ‌ళి పార్టీతో అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించాడు.

లేటెస్ట్‌గా బండ్ల గ‌ణేష్ తెలుసు క‌దా మూవీ స‌క్సెస్ మీట్‌కు హాజ‌ర‌య్యాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియా మీద ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించాడు. మీడియా పెన్ డౌన్ చేస్తే త‌మ‌కు కింద వ‌ణుకుతాయి అంటూ త‌నదైన శైలిలో కామెంట్ చేశాడు బండ్ల‌. ఇంకా ఈ స్పీచ్‌లో మీడియా గురించి ఆయ‌నేమ‌న్నారంటే..

”మీడియా మిత్రులంటే.. మ‌న హృద‌యాన్ని, మ‌న జీవితాన్ని ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు తీసుకెళ్లి వీళ్లు ఇదిరా బాబు అని చెప్పేవాళ్లు. పోలీసు వాళ్ల‌కు సెల‌వు రోజు ఉండ‌దు. అలాగే మీడియా వాళ్ల‌కూ అంతే. మేమొక పండుగ రోజు ఓపెనింగ్ పెట్టుకుంటే.. మీకు కూడా అదే మంచి రోజు అనుకుని కెమెరాలు, పెన్నులు ప‌ట్టుకుని వ‌చ్చేస్తారు. మా న్యూస్‌ను కొన్ని కోట్ల మందికి చేర‌వేసే మీడియా మిత్రుల‌కు హృద‌య‌పూర్వ‌క పాదాభివంద‌నాలు. మీడియా ఎంత ప‌వ‌ర్ ఫుల్ అన్న‌ది నేను ఒక ఉదాహ‌ర‌ణ చెబుతా. ఎస్వీ కృష్ణారెడ్డి గారు వినోదం సినిమాలో న‌న్ను ప‌రిచ‌యం చేసిన‌పుడు ఒక ప‌త్రిక‌లో శ్రీకాంత్, శివాజీ రాజా, ఉత్తేజ్ త‌దిత‌రులు అని నేను కూడా ఉన్న ఫొటో వేశారు. 

నా పేరు వేయ‌నందుకు నేను రెండు రోజులు నిద్ర పోలేదు. ఆ టెన్ష‌న్, ఆ బాధ ఎప్ప‌టికీ మ‌రిచిపోలేదు. ఆ రోజు గ‌ణేష్ అని నా పేరు కూడా రాస్తే ఎంత బాగుండేది అని ఫీల‌య్యాను. ఆ రోజు ఆ రిపోర్ట‌ర్‌కు ఫోన్ చేసి నా పేరు ఎందుకు రాయ‌లేదు అంటే.. సారీ గ‌ణేష్‌, మ‌ర్చిపోయా అన్నాడు. మీడియా వాళ్లు మా మీద కోపం వ‌చ్చి పెన్ డౌన్ చేసి మాకు కింద వ‌ణుకుతాయి. మీ ప‌వ‌ర్ అది. మీ గొప్ప‌ద‌నం అది. మేం మామూలు అసిస్టెంట్ డైరెక్ట‌ర్లుగా, చిన్న చిన్న ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్‌లుగా ఉండి.. త‌ర్వాత పెద్ద స్థాయికి వెళ్లాక కూడా మ‌మ్మ‌ల్ని ఒకేలా చూస్తారు. గౌర‌విస్తారు. అది మీ గొప్ప‌ద‌నం. మీ రుణం తీర్చుకోలేనిది. మీడియా స‌పోర్ట్ మా నిర్మాత‌ల మీద‌, ఇండ‌స్ట్రీ మీద ఉండాలి. సినిమాకు, ఇండ‌స్ట్రీకి మ‌ధ్య వార‌ధిగా ఉంటూ.. మీ చ‌ల్ల‌ని చూపు మాపై ఉండాల‌ని కోరుకుంటున్నా” అని బండ్ల గ‌ణేష్ పేర్కొన్నాడు.

This post was last modified on October 23, 2025 9:20 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

సంక్రాంతి ఎఫెక్ట్: హైదరాబాద్ నిల్లు… విజయవాడ ఫుల్లు

సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…

1 hour ago

దెబ్బతిన్న హీరోలు vs రావిపూడి

టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…

1 hour ago

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

2 hours ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

3 hours ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

3 hours ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

3 hours ago