‘వి’తో యాక్షన్ హీరోగా తనలో కొత్త కోణాన్ని చూపించే ప్రయత్నం చేశాడు సుధీర్ బాబు. కానీ ఆ సినిమా వర్కవుట్ కాలేదు. దీంతో ఈసారి రూటు మార్చి ‘శ్రీదేవి సోడా సెంటర్’ అనే పీరియడ్ మూవీకి రెడీ అయిపోయాడు. ‘పలాస 1978’ సినిమాతో ఆకట్టుకున్న కొత్త దర్శకుడు కరుణ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు.
ఈ మధ్యనే రిలీజైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. ఆ పోస్టర్లో సెటప్ అంతా చూస్తే ‘పలాస’ తరహాలోనే కరుణ్ కుమార్ మళ్లీ కాలంలో వెనక్కి వెళ్తున్నాడని స్పష్టమవుతోంది. జాతర జరిగే చోట సోడాలమ్ముతూ, ఎలక్ట్రీషియన్ పనులు చేసే కుర్రాడిగా సుధీర్ బాబు ఇందులో కనిపించబోతున్నాడు. ఈ సినిమాను అనౌన్స్ చేసినపుడు హీరోయిన్ ఎవరన్నది ప్రకటించలేదు. ఇంకా ఈ విషయంలో ప్రకటన ఏదీ రాలేదు.
ఐతే సుధీర్ సరసన ఓ ఆసక్తికర హీరోయిన్‌ను సెట్ చేసినట్లు సమాచారం. ఆ అమ్మాయే.. ఆనంది అలియాస్ రక్షిత. తెలుగమ్మాయే అయిన ఆనంది.. రక్షిత పేరుతో తెలుగులో ఈ రోజుల్లో, బస్ స్టాప్ లాంటి సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు చేసింది. ఆ తర్వాత ఆనందిగా పేరు మార్చుకుని తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ మంచి మంచి సినిమాలు చేసి కథానాయికగా ఓ స్థాయిని అందుకుంది. ఇప్పుడు టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తోంది. ఆల్రెడీ ‘జాంబీ రెడ్డి’ సినిమాలో ఆనంది కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఈ అమ్మాయికి ‘శ్రీదేవి సోడా సెంటర్’లో ఛాన్స్ దక్కింది. టైటిల్లో ఉన్న శ్రీదేవి అలనాటి అందాల తార శ్రీదేవినా, లేక హీరోయిన్ పేరు అదా అన్నది చూడాలి. కరుణ్ కుమార్ చాలా వరకు లోకల్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తాడని అతడి తొలి సినిమా చూస్తేనే అర్థమవుతుంది. మంచి పెర్ఫామర్‌గా తమిళంలో పేరు తెచ్చుకున్న తెలుగమ్మాయిని అందుకే ఏరికోరి తన కొత్త సినిమాకు ఎంచుకున్నట్లున్నాడు. సుధీర్‌తో ‘భలే మంచి రోజు’ చిత్రాన్ని నిర్మించిన 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది.
This post was last modified on December 1, 2020 9:58 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…