పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు చాలా ఏళ్ల తర్వాత మంచి కిక్కు దొరికింది ‘ఓజీ’ మూవీతో. పవన్‌ను అభిమానులు ఎలా చూడాలనుకుంటారో అలా చూపించి వాళ్లకు పూనకాలు తెప్పించాడు యువ దర్శకుడు సుజీత్. పేరుకు పాన్ ఇండియా మూవీ కానీ.. ఈ సినిమాకు వచ్చిన వసూళ్లన్నీ తెలుగు నుంచి వచ్చినవే. తెలుగు వెర్షన్‌తోనే ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఈ ఏడాదికి టాలీవుడ్ నుంచి హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది ‘ఓజీ’.
ఐతే ఈ సినిమా గురించి కన్నడ దర్శక నిర్మాత చంద్రు చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి.
తనే డైరెక్ట్ చేసి, ప్రొడ్యూస్ చేసిన ‘కబ్జా’ సినిమా స్ఫూర్తితో ‘ఓజీ’ తీశారని అతను వ్యాఖ్యానించాడు. ఉపేంద్ర హీరోగా కన్నడ సినిమా చరిత్రలోనే అత్యధిక బడ్జెట్లో ‘కబ్జా’ తీశాడు చంద్రు. ఐతే ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. అలాంటి సినిమాను చూసి ‘ఓజీ’ తీశారనడం ఆశ్చర్యం కలిగించే విషయం.
‘ఓజీ’ కథ కొత్తదేమీ కాదు. పూర్వాశ్రమంలో హీరో డాన్‌గా ఉండడం.. ఏదో కారణంతో అవన్నీ వదిలేసి సాత్వికుడిగా మారిపోవడం.. అత్యవసర పరిస్థితుల్లో తిరిగొచ్చి మళ్లీ తన ఆధిపత్యాన్ని చాటడం ‘బాషా’ రోజుల నుంచి చూస్తూనే ఉన్నాయి. మరి కొత్తగా ‘కబ్జా’ సినిమా నుంచి ‘ఓజీ’కి స్ఫూర్తి పొందడం ఏముంది? నిజానికి ‘కబ్జా’ మూవీ మీదే కాపీ ముద్ర పడింది.
‘కేజీఎఫ్’ను చూసి వాత పెట్టుకున్నారని రిలీజ్ టైంలో తీవ్ర విమర్శలు వచ్చాయి. కథ నుంచి టేకింగ్ వరకు మొత్తంగా ‘కేజీఎఫ్’ స్టైల్ ఫాలో అయిపోయారు. సినిమా ఆడకపోవడానికి కూడా అదే కారణమైంది. ‘కబ్జా’ ఫ్లాప్ అయినప్పటికీ దానికి సీక్వెల్ తీయాలని ఆ పనులు కూడా మొదలుపెట్టాడు చంద్రు. కానీ అది వర్కవుట్ కాదని తర్వాత ఆపేసినట్లు తెలుస్తోంది.
This post was last modified on October 23, 2025 9:12 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…