Movie News

కంగారెత్తిస్తున్న కొత్త కుర్రాడి స్టార్‌డమ్

దర్శకుడిగా రెండు సినిమాలు.. హీరోగా రెండు సినిమాలు.. ఇంతలోనే ప్రదీప్ రంగనాథన్ అనే కుర్రాడు తెచ్చుకున్న ఫాలోయింగ్, మార్కెట్ చూసి ఇప్పుడు సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ షాకైపోతోంది. తన సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే వంద కోట్ల వసూళ్లు ఈజీగా వచ్చేసే పరిస్థితి కనిపిస్తోంది. ప్రదీప్ కొత్త చిత్రం ‘డ్యూడ్’కు ఎబోవ్ యావరేజ్ టాక్ వచ్చింది. అయినా ఈ సినిమా ఇప్పటిదాకా వరల్డ్ వైడ్ రూ.80 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది.

అటు తమిళంలోనే కాదు.. ఇటు తెలుగులోనూ ఆ చిత్రం దీపావళి హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచే సంకేతాలు కనిపిస్తున్నాయి. ‘డ్యూడ్’కు వచ్చిన ఓపెనింగ్ కోలీవుడ్‌కు పెద్ద షాక్. తొలి రోజు ఏకంగా 22 కోట్లు రాబట్టింది. మిడ్ రేంజ్ స్టార్లకు కూడా సాధ్యం కాని ఓపెనింగ్ ఇది. హీరోగా కేవలం రెండు సినిమాల అనుభవంతో ప్రదీప్ ఇలాంటి ఓపెనింగ్ రాబట్టడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది.
ప్రదీప్ ముందు దర్శకుడిగా కోలీవుడ్లోకి అడుగుపెట్టాడు.

జయం రవి హీరోగా ‘కోమాలి’ సినిమా తీశాడు. అది ఓ మోస్తరుగా ఆడింది. తర్వాత అవకాశాలు రాలేదు. గ్యాప్ వచ్చింది. దీంతో తనే హీరోగా అరంగేట్రం చేస్తూ ‘లవ్ టుడే’ సినిమా తీయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. పెద్ద ప్రొడక్షన్ హౌస్ సపోర్ట్ దొరికింది. ఆ సినిమా అటు తమిళంలో, ఇటు తెలుగులో సెన్సేషన్ క్రియేట్ చేసింది. తర్వాత హీరోగా చేసిన ‘డ్రాగన్’ ఏకంగా రూ.140 కోట్ల మేర వసూళ్లు రాబట్టి ఔరా అనిపించింది.

లుక్స్ పరంగా చాలా మామూలుగా అనిపించినా.. తన పెర్ఫామెన్స్, స్టైల్‌తో ప్రదీప్ యువతను కట్టిపడేస్తున్నాడు. ‘డ్యూడ్’ అంత గొప్ప సినిమా కాకపోయినా ఆడుతోందంటే.. ప్రదీప్ పెర్ఫామెన్స్ ముఖ్య కారణం.

వీక్ సినిమాను కూడా నిలబెట్టే స్థాయికి తన స్టార్‌డమ్ చేరుకుంది. తక్కువ టైంలో తనకు వచ్చిన ఈ ఫాలోయింగ్, మార్కెట్ స్టార్లను కంగారు పెట్టేదే. అదే సమయంలో తన మీద అంచనాలు పెరిగిపోవడం ప్రదీప్‌కు కూడా ఇబ్బందికరమే. ఇకపై కథలు ఎంచుకోవడం, హిట్లు డెలివర్ చేయడం అతడికి సవాలుగా మారొచ్చు. ఐతే స్వతహాగా దర్శకుడు కాబట్టి అతను జాగ్రత్తగానే అడుగులు వేస్తాడని, మంచి జడ్జిమెంట్‌తో సినిమాలు చేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.

This post was last modified on October 21, 2025 3:01 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Dude

Recent Posts

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

2 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

2 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

5 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

7 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

7 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

7 hours ago