ఈ దీపావళికి మూడు రోజుల వ్యవధిలో నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. అన్ని సినిమాలూ ప్రామిసింగ్‌గా కనిపించడంతో గత దీపావళి లాగే ఈసారి కూడా 100 పర్సంట్ సక్సెస్ రేట్ చూస్తామా అన్న ఆశలు కలిగాయి. కానీ పండుగ రేసులో ముందుగా వచ్చిన ‘మిత్రమండలి’ అంచనాలకు చాలా దూరంలో ఆగిపోయింది. డిజాస్టర్ టాక్ తెచ్చుకుని వీకెండ్లోనే సినిమా చతికిలపడిపోయింది. మిగతా మూడు చిత్రాలకు అలాంటి రిజెక్షన్ కనిపించలేదు.
అన్నింట్లోకి తమిళ అనువాదమైన ‘డ్యూడ్’ బెటర్ టాక్, రివ్యూలు తెచ్చుకుంది. సిద్ధు జొన్నలగడ్డ సినిమా ‘తెలుసు కదా’కు మోడరేట్ రివ్యూలు వచ్చాయి. కిరణ్ అబ్బవరం మూవీ ‘కే ర్యాంప్’ బిలో యావరేజ్ రివ్యూలు, టాక్‌తో మొదలైంది. ఐతే వీకెండ్ అయ్యేసరికి బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ చూస్తే ‘కే ర్యాంప్’ పైచేయి సాధించడం విశేషం. దీనికి యుఎస్ ప్రిమియర్స్ నుంచి వచ్చిన రివ్యూలు, టాక్ చూస్తే డిజాస్టర్ అవుతుందేమో అనిపించింది.
కానీ ఏపీ, తెలంగాణల్లో షోలకు బెటర్ టాక్ వచ్చింది. ఇక్కడి రివ్యూలు కూడా కాస్త మెరుగ్గా వచ్చాయి. బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ మాత్రం అందరి అంచనాలను మించిపోయింది. శని, ఆదివారాల్లో ఈ సినిమాకు హౌస్ ఫుల్ షోలు పడ్డాయి. సోమవారం దీపావళి పండుగ రోజు కూడా సినిమా బాగా పెర్ఫామ్ చేస్తోంది. తొలి రోజు ఈ మూవీ 4 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. రెండో రోజు అందుకు దీటుగా వసూళ్లున్నాయి. సోమవారం కూడా వసూళ్లకు ఢోకా లేదు కాబట్టి పది కోట్ల వసూళ్ల మార్కును ‘కే ర్యాంప్’ దాటేయబోతోంది.
మరోవైపు ‘డ్యూడ్’ మూవీకి వసూళ్లు నిలకడగానే ఉన్నాయి. కానీ మాస్ సెంటర్లలో ‘కే ర్యాంప్’ ఎఫెక్ట్ దాని మీద పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ‘తెలుసు కదా’ క్లాస్ మూవీ కావడంతో మల్టీప్లెక్సుల్లో రెస్పాన్స్ బాగుంది. బి, సి సెంటర్లలో కష్టపడుతోంది. ఓవరాల్‌గా చూస్తే ‘కే ర్యాంప్’, ‘డ్యూడ్’ దాదాపు సమాన స్థాయిలో సాగుతున్నప్పటికీ.. బ్యాడ్ టాక్, రివ్యూలతో మొదలైన ‘కే ర్యాంప్’ అంచనాలకు మించిన వసూళ్లను సాధించడం దీపావళికి అతి పెద్ద సర్ప్రైజ్ అని చెప్పొచ్చు.
This post was last modified on October 20, 2025 10:27 pm
దానం నాగేందర్‌పై వేటు పడడం.. ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావడం.. ఇటీవల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…
శ్రీకాంత్ ఓదెల.. ఈ పేరు చెప్పగానే అందరికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…
నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…
నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…
వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…
సెప్టెంబర్ అయిపోతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ప్రచారం చేసుకున్న రామాయణ పార్ట్ 1 విడుదలకు కేవలం నలభై రోజులు…