Movie News

రవితేజకు, దర్శకుడికి గొడవేంటి?

మాస్ రాజా రవితేజ కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా పూరి జగన్నాథ్ ‘ఇడియట్’ అయినప్పటికీ.. అంతకుముందు తనకు హీరోగా తొలి అవకాశం ఇచ్చింది మాత్రం కృష్ణవంశీనే. వీరి కలయికలో వచ్చిన ‘సింధూరం’ అనుకున్నంత విజయం సాధించకపోయినా కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది. ఇందులో రవితేజ పెర్ఫామెన్సుకు కూడా మంచి పేరొచ్చింది. అంతకంటే ముందు కృష్ణవంశీ దర్శకత్వంలో ‘నిన్నే పెళ్ళాడతా’లో ఒక చిన్న పాత్ర చేశాడు రవితేజ. 

ఇక హీరోగా స్టార్ స్టేటస్ తెచ్చుకున్నాక కూడా కృష్ణవంశీ దర్శకత్వంలో ‘ఖడ్గం’ లంటి కల్ట్ మూవీ చేశాడు. అందులో నటనకు కూడా మంచి పేరొచ్చింది. వీళ్లిద్దరూ 90వ దశకంలోనే మంచి స్నేహితులు. కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పని చేశాడు రవితేజ. ఐతే రవితేజకు, కృష్ణవంశీకి ఎక్కడ చెడిందో కానీ..చాలా ఏళ్ల నుంచి ఇద్దరి మధ్య మ ాటలు లేవని తెలుస్తోంది. రవితేజ ఇప్పటికీ కృష్ణవంశీ గురించి ఇంటర్వ్యూల్లో మామాలుగానే మాట్లాడతాడు. 

ఇటీవల ‘మాస్ జాతర’కు సంబంధించి ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో కూడా కృష్ణవంశీ గురించి పాజిటివ్‌గానే మాట్లాడాడు. కృష్ణవంశీ తనను ఏరా అనే పిలిచేవాడని చెప్పాడు. కానీ కృష్ణవంశీ మాత్రం రవితేజ ఊసు ఎత్తడానికి అస్సలు ఇష్టపడట్లేదు. కృష్ణవంశీకి సంబంధించిన పలు ఇంటర్వ్యూలను గమనిస్తే ఆ విషయం అర్థమవుతుంది. రవితేజ, లేదా తన సినిమాల ప్రస్తావన వస్తే.. నెక్స్ క్వశ్చన్ అనడం.. దాని గురించి మాట్లాడను అని చెప్పడం, ఏమో తెలీదు అనడం లాంటివి చేశాడు. 

మాస్ జాతర ఇంటర్వ్యూలో కృష్ణవంశీ గురించి రవితేజ మాట్లాడిన వీడియోల కింద.. రవితేజ విషయమై పలు ఇంటర్వ్యూల్లో కృష్ణవంశీ అవాయిడ్ చేసిన వీడియో కనిపిస్తోంది. అసలు ఇద్దరికీ మధ్య ఏం జరిగింది.. కృష్ణవంశీ ఎందుకు హర్టయ్యాడు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కృష్ణవంశీ బ్యాడ్ ఫేజ్‌లో ఉండగా సినిమా చేద్దామంటే రవితేజ ఒప్పుకోలేదా.. లేదా మాట ఇచ్చి తప్పాడా.. లేక ఇద్దరి మధ్య ఇంకేదైనా గొడవ జరిగిందా అన్నది జనాలకు అర్థం కావడం లేదు. మరి ఈ ప్రశ్నలకు ఎప్పుడు జవాబు దొరుకుతుందో మరి.

This post was last modified on October 20, 2025 10:22 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Raviteja

Recent Posts

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

33 minutes ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

1 hour ago

హై కోర్టుకు సారీ చెప్పిన హైడ్రా, ఏం జరిగింది?

`సారీ మైలార్డ్‌.. ఇక‌పై అలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌వు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా క‌మిష‌న‌ర్‌, ఐపీఎస్ అధికారి రంగ‌నాథ్…

2 hours ago

లోకేష్ కోసం వెళ్ళని చంద్రబాబు ఏపీ కోసం వచ్చారు

పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…

2 hours ago

అఖండ అనుభవం.. అలెర్ట్ అవ్వాలి

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…

3 hours ago

ఐదుగురికి కమిట్మెంట్ అడిగారు.. నో చెప్పా

సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…

3 hours ago