ఫిలిం బ్యాగ్రౌండ్ ఉన్న సెలబ్రెటీల జీవితాల్లో కష్టాలు, కన్నీళ్లు ఏముంటాయి అనుకుంటాం. కానీ వాళ్ల జీవితాల్లో జనాలకు తెలియని కోణాలుంటాయి. లెజెండరీ ప్రొడ్యూసర్ స్రవంతి రవికిషోర్ అన్న కొడుకైన రామ్ టీనేజీలోనే, తొలి సినిమా ‘దేవదాసు’తోనే స్టార్ ఇమేజ్ సంపాదించేశాడు. ఆ తర్వాత అతను వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఐతే చిన్నప్పట్నుంచి రిచ్‌గా బతికిన అతడి కుటుంబం.. ఒక దశలో సంక్షోభం చూసిందట. ఏమీ లేని స్థితిలో ఫ్యామిలీ రోడ్డు మీదికి వచ్చేసిందట. ఆ స్థితి నుంచి తాము ఎలా కష్టపడి ఎదిగామో రామ్.. జగపతి బాబు నిర్వహిస్తున్న టీవీ షోలో వెల్లడించాడు.
‘‘నా గురించి చాలామందికి కొన్ని విషయాలు తెలియవు. అమ్మ వాళ్లది హైదారబాద్ కావడంతో నేను ఇక్కడే పుట్టాను. తర్వాత కుటుంబంతో కలిసి విజయవాడ వెళ్లాం. మాది కలిగిన కుటుంబమే. కానీ 1988లో విజయవాడలో కుల ఘర్షణలు జరిగాయి. వాటి వల్ల ఒక రాత్రిలో మేమంతా జీరో అయిపోయాం. అప్పటి వరకు మేం సంపాదించిందంతా కోల్పోయాం. విజయవాడలో ఉండలేక చెన్నైకి వెళ్లిపోయాం.
మేం ఎంత దెబ్బ తిన్నాం, మా జీవితాలు ఎలా మారిపోయాయి అనడానికి ఒక ఉదాహరణ చెబుతా. విజయవాడలో ఉణ్నపుడు నా బొమ్మల కోసమే ఒక పెద్ద గది ఉండేది. చెన్నైకి మారినపుడు ఆ బొమ్మల గదితో పోలిస్తే మా ఇల్లు సగం కూడా లేదు. పెద్ద ఇంటి నుంచి చిన్న ఇంటికి వెళ్లి సర్దుకున్నాం. నాన్న మళ్లీ జీరో నుంచి మొదలుపెట్టారు. కానీ కింది నుంచి కష్టపడి ఒక స్థాయికి రావడం వేరు. కష్టపడి పైకి వచ్చాక మొత్తం కోల్పోయి, మళ్లీ కింది నుంచి మొదలుపెట్టడం వేరు. మా నాన్న ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూశారు. అందుకే ఆయనంటే నాకు చాలా గౌరవం’’ అని రామ్ వెల్లడించాడు.
This post was last modified on October 20, 2025 5:04 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…