హీరో విశాల్ కు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. అందుకే ఎన్ని ఫ్లాపులు వచ్చినా తన కొత్త రిలీజ్ ఏదైనా ఉందంటే ఏపీ తెలంగాణలోనూ సమాంతరంగా రిలీజ్ చేస్తుంటారు. ఈ మధ్య విశాల్ మాటలు, చేతల పరంగా చూపిస్తున్న దూకుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. మగుడం దర్శకుడు రవి అరసుని మార్చేసి తనే మెగా ఫోన్ చేపట్టడం పట్ల డైరెక్టర్ సంఘాలు ఆగ్రహంతో ఉన్నాయి. గతంలో మిస్కిన్ తో గొడవపడి డిటెక్టివ్ 2 ని డోలాయమానంలో పడేసిన విశాల్ తాజాగా ఒక పాడ్ క్యాస్ట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అవార్డులను చులకనగా మాట్లాడ్డం మూవీ లవర్స్ ఆగ్రహానికి కారణమవుతోంది.
వంద కోట్లకు పైగా ప్రజలున్న దేశంలో కేవలం ఒక ఏడెనిమిది మంది జ్యురీ సభ్యులు ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడని అవార్డులను ఎలా ఎంపిక చేస్తారని, ఇదంతా నాన్సెన్స్ అని చెబుతూనే నేనైతే జాతీయ పురస్కారం దక్కినా చెత్తబుట్టలో పారేస్తానని చెప్పడం కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. నిజానికి నేషనల్ అవార్డుల గురించి అంత అవమానకరంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందరో మహానుభావులు వీటిని అందుకున్నారు. ఇటీవలే మోహన్ లాల్ కు దాదా సాహెబ్ ఫాల్కే వరించినప్పుడు భాషతో సంబంధం లేకుండా మూవీ లవర్స్ అందరూ హర్షం వ్యక్తం చేశారు.
ఆ మాకొస్తే ఆస్కార్ ని ఎంపిక చేసేది కూడా పరిమిత సభ్యులే. కమిటీ చిన్నదైనా పెద్దదైనా లిమిటెడ్ నెంబరే ఉంటుంది. అంతే తప్ప ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని మెంబెర్ గా చేసుకోవడం అసాధ్యం. ఏమైనా సరే విశాల్ ఇలాంటి విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నడిగర్ సంఘం బిల్డింగ్ కట్టించాక పరిశ్రమలో ఇమేజ్ పెరిగిన విశాల్ ఇప్పుడిలాంటి వ్యాఖ్యల ద్వారా లేనిపోని రాద్ధాంతానికి అవకాశం ఇస్తున్నాడు. ధన్సికని త్వరలో పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడు కాబోతున్న విశాల్ చేతిలో మూడు సినిమాలున్నాయి. మగుడం రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు. బహుశా క్రిస్మస్ ఉండొచ్చు.
This post was last modified on October 19, 2025 1:01 pm
విశ్వక్ సేన్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ లైలా. ఆడవేషం వేసి నరేష్ పాత సినిమా చిత్రం భళారే విచిత్రంలాగా…
#AskKavitha- హ్యాష్ ట్యాగ్‌తో నెటిజన్ల నుంచి అభిప్రాయాలు సేకరించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత.. ఇదే సమయంలో పలువురు నెటిజన్లు…
భారతదేశం గర్వించదగ్గ గొప్ప సంగీత విద్వాంసుల్లో ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి స్థానం ఎవరూ భర్తీ చేయనిది, అందుకోలేనిది. దక్షిణాదిలోనే కాదు…
మాటిచ్చిన కేవలం పదిరోజుల్లోనే ఆ హామీని కార్యరూపంలోకి తీసుకువచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. తొమ్మిది రోజుల క్రితం చిలకలూరిపేట…
నటుడిగా చాలా గ్యాప్ తీసుకున్న మంచు మనోజ్ ఈ ఏడాది రెండు సినిమాల్లో విలన్ గా నటించి కంబ్యాక్ అయ్యాడు.…
హర్యానాలో పనిచేస్తున్న తెలుగు ఐపీఎస్ అధికారి వై. పూరన్ కుమార్ ఆత్మహత్య ఘటనలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ…