టాలీవుడ్ ఒకప్పుడు దీపావళి సీజన్ మీద పెద్దగా ఫోకస్ చేసేది కాదు. సంక్రాంతి, దసరాల మీద ఉన్నంత దృష్టి ఈ పండుగ మీద ఉండదు. కానీ గత ఏడాది కథ మారింది. దీపావళి టాలీవుడ్‌కు భలేగా కలిసి వచ్చింది. తెలుగు నుంచి రిలీజైన లక్కీ భాస్కర్, క చిత్రాలతో పాటు అనువాద చిత్రమైన అమరన్ చాలా బాగా ఆడాయి. ఇలా ఒక పండుగ సీజన్లో రిలీజైన మూడు సినిమాలూ సక్సెస్ కావడం అరుదు. అందుకేనేమో ఈసారి పండక్కి ఏకంగా నాలుగు సినిమాలను బరిలోకి దించారు.
అందులో మూడు డైరెక్ట్ మూవీస్ కాగా.. ఒకటి అనువాదం. ఈ నాలుగు చిత్రాల మీదే ఓ మోస్తరు అంచనాలే నిలిచాయి. మరి వీటిలో దీపావళి విజేతగా ఏది నిలుస్తుంది.. గత ఏడాది లాగే 100 పర్సంట్ సక్సెస్ రేట్ ఉంటుందా అని ఎదురు చూశారు ప్రేక్షకులు. ఐతే ఈసారి దీపావలి ఆరంభమే తీవ్ర నిరాశకు గురి చేసింది. ‘జాతిరత్నాలు’, ‘మ్యాడ్’ తరహలో నవ్వుల్లో ముంచెత్తుతందనుకున్న ‘మిత్రమండలి’ పూర్తిగా నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. పెయిడ్ ప్రిమియర్స్ నుంచి బ్యాడ్ టాక్ రావడంతో తొలి రోజే సినిమాకు వసూళ్లు లేవు. ప్రేక్షకులు ఔట్ రైట్‌గా ఈ చిత్రాన్ని తిరస్కరించారు.
ఇక శుక్రవారం రిలీజైన డ్యూడ్, తెలుసు కదా చిత్రాలకు మిశ్రమ స్పందన వచ్చింది. డ్యూడ్ యూత్‌ను ఆకట్టుకున్నప్పటికీ పూర్తి సంతృప్తిని ఇవ్వలేకపోయాయి. ఐతే ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ‘తెలుసు కదా’ క్లాస్ ప్రేక్షకులను మెప్పించింది కానీ.. ఎక్కువమంది బోర్ అనే అంటున్నారు. మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఈ చిత్రాన్ని ఆదరించేలా ఉన్నారు. రివ్యూస్ మోడరేట్‌గా వచ్చాయి.
ఇక రేసులో చివరగా వచ్చిన ‘కే ర్యాంప్’కు క్రిటిక్స్ తక్కువ రేటింగ్స్ ఇచ్చారు. కానీ ఇందులో మాస్ కామెడీ యూత్, మాస్‌కు ఎక్కుతున్నట్లే కనిపిస్తోంది. ‘కే ర్యాంప్’కు మంచి ఓపెనింగ్స్ వచ్చేలా ఉన్నాయి. ముఖ్యంగా బి, సి సెంటర్లలో స్పందన బాగుంది. ఈ దీపావళికి క్లియర్ విన్నర్ అంటూ ఏ సినిమా లేదు. ఓపెనింగ్స్ పరంగా డ్యూడ్, కే ర్యాంప్ బెటర్‌గా పెర్ఫామ్ చేసేలా ఉన్నాయి. పూర్తి స్థాయి విన్నర్ ఎవరనేది ఒక వారం గడిస్తే కానీ చెప్పలేం.
This post was last modified on October 19, 2025 7:42 am
ఓటిటిలో డైరెక్ట్ గా రిలీజైనా కలర్ ఫోటోకు మంచి స్పందన వచ్చిన సంగతి ప్రేక్షకులకు గుర్తే. కొత్త ప్రేమకథ కాకపోయినా…
అఖండ సినిమా ఓటీటీలో రిలీజైనపుడు హిందీ ప్రేక్షకులు సైతం విరగబడి చూశారు. డివైన్ ఎలిమెంట్స్‌తో తీసిన సినిమాలకు కొన్నేళ్ల నుంచి…
ఏపీ సీఎం చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా ఏపీలో పెట్టుబడులు, పరిశ్రమల రాక, ఉద్యోగాలు, ఉపాధి కల్పన వంటి…
ఆదిత్య ధర్.. ఇప్పుడు బాలీవుడ్లోనే కాక, దేశవ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీల్లోనూ చర్చనీయాంశం అవుతున్న పేరిది. బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్లలో ఒకటిగా…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే స్పిరిట్, కల్కి-2 చిత్రాల నుంచి తప్పుకోవడం ఆ మధ్య చర్చనీయాంశంగా మారిన సంగతి…
హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణను తెలంగాణ ఉద్యమకారులు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఎస్పీ బాలు తెలంగాణ…