Movie News

టిల్లు భామకు దక్కని డబుల్ ప్రయోజనం

డీజే టిల్లు లాంటి బ్లాక్ బస్టర్ లో భాగమైనప్పుడు ఏ హీరోయిన్ కైనా అంతకన్నా పెద్ద బ్రేక్ ఏం దొరుకుతుందని అనుకుంటాం. కానీ నేహా శెట్టి విషయంలో అది జరగలేదు. క్యారెక్టర్ లో ఉన్న గ్రే షేడ్ వల్ల ఆమెను జనం ఇంకోలా రిసీవ్ చేసుకున్నారు. ఇండస్ట్రీ జనాలు సైతం ఆ కోణంలో పాత్రలు ఆఫర్ చేయడం వల్ల కెరీర్ ముందుకెళ్ళలేదు. తర్వాత కిరణ్ అబ్బవరం లాంటి హ్యాపెనింగ్ హీరోలతో నటించినా సరే డిజాస్టర్లు పలకరించడంతో అవకాశాలు తగ్గిపోయాయి. అందుకే క్యామియోలు, స్పెషల్ సాంగ్ లకు ఎస్ చెప్పేస్తోంది. అలా మూడు వారాల గ్యాప్ లో నేహా శెట్టి రెండుసార్లు తెరమీద దర్శనమిచ్చింది. కానీ లాభం లేదు.

ఓజిలో స్పెషల్ సాంగ్ చేసిందని విన్నప్పుడు ఏదో పుష్ప రేంజ్ లో ఊహించుకున్నారు ఫ్యాన్స్. కానీ తీరా చూస్తే రిలీజైన మొదటి నాలుగైదు రోజులు అసలా పాటే లేదు. సరేలే అని తర్వాత జోడిస్తే దాని వల్ల ఎలాంటి ఉపయోగం జరగలేదు. ఒకపక్క పవన్ కళ్యాణ్ గాయంతో బాధ పడుతుంటే ఇంకోపక్క నేహా శెట్టి డాన్స్ చేయడాన్ని జనాలు అంగీకరించలేదు. దర్శకుడు సుజిత్ ఉద్దేశం ఏదైనా ఆడియన్స్ కి సింక్ కాలేదు. తాజాగా డ్యూడ్ లో కాసేపు కనిపించే చిన్న క్యామియో చేసింది. అది కూడా వేరొకరి భార్యగా. కథ పరంగా ఓకే ఏమో కానీ నేహా శెట్టికి ఎక్కువ స్కోప్ దక్కిందేమోనని భావించిన ఫ్యాన్స్ నిరాశ పడ్డారు.

అయినా ఇక్కడ నేహా శెట్టి తప్పేం లేదు. లీడ్ రోల్స్ రావడం లేదు. సక్సెస్ ఉంటేనే ఇక్కడ పలకరిస్తారు. రష్మిక మందన్న, శ్రీలీలలాగా సుడి బాగుంటే అన్ని బాషల నుంచి సినిమాలొస్తాయి. కానీ నేహా శెట్టికి ప్రమోషన్ లా పనికొచ్చే పెద్ద హీరో మూవీ ఒక్కటీ పడలేదు. అదే సమస్య. గ్యాంగ్స్ అఫ్ గోదావరి లాంటి వాటి మీద బోలెడు ఆశలు పెట్టుకుంటే అవేమో తీవ్రంగా నిరాశ పరిచాయి. అయినా దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్నట్టు ఇమేజ్ పరంగా తనకేం వస్తుంది, రాదు అనే దానికన్నా వచ్చిన ఆఫర్స్ ని ఒప్పేసుకుని వీలైనంత ఫిల్మోగ్రఫీని పెంచుకోవడం తప్ప నేహశెట్టి చేయగలిగింది ఏముంది.

This post was last modified on October 18, 2025 10:44 pm

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

2 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

3 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

3 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

3 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

5 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

5 hours ago