Movie News

ప్రదీప్ భలే కనెక్ట్ అవుతున్నాడు

మిడిల్ క్లాస్ కుర్రాడిగా అచ్చం మన పక్కింట్లో ఉండే సగటు యువకుడిగా కనిపించే ప్రదీప్ రంగనాథన్ క్రమంగా యూత్ కి మరింత దగ్గరవుతున్నాడు. డ్యూడ్ కు వస్తున్న వసూళ్లే దానికి నిదర్శనం. తమిళంలో అంటే ఏమో అనుకోవచ్చు కానీ తెలుగులోనూ మంచి ఓపెనింగ్స్ తేవడం మనోళ్లకు ఎంతగా కనెక్ట్ అయ్యాడో తేటతెల్లం చేస్తోంది. ఒరిజినల్ వెర్షన్ కు బైసన్ రూపంలో గట్టి పోటీ తగలడంతో అక్కడ కొంచెం పికప్ స్లోగా ఉంది కానీ తెలుగులో కె ర్యాంప్, తెలుసు కదాలు ఉన్నా సరే యూత్ మొదటి ప్రాధాన్యత డ్యూడ్ కావడం విశేషం. ముఖ్యంగా ఏ సెంటర్స్ లో ప్రదీప్ రంగనాథన్ ఆధిపత్యం స్పష్టంగా ఉంది.

నిజానికి డ్యూడ్ మీద మరీ సూపర్ పాజిటివ్ రిపోర్ట్స్ రాలేదు. ఆ మాటకొస్తే పవన్ కళ్యాణ్ బంగారం, తరుణ్ నువ్వే కావాలి – నువ్వు లేక నేను నేను, అల్లు అర్జున్ హ్యాపీ లాంటి పాత తెలుగు సినిమాల ఛాయలు బోలెడు కనిపిస్తాయి. కానీ దర్శకుడు తెలివిగా ఇప్పటి ట్రెండ్ కు అనుగుణంగా కొత్త మసాలాలు జోడించి కాలక్షేపం చేయించాడు. అంత సులభంగా ఒప్పుకోలేని పాయింట్స్ ఇందులో చాలానే ఉన్నాయి కానీ ప్రదీప్ స్క్రీన్ ప్రెజెన్స్ వల్ల చాలా మటుకు అవి కవరైపోయాయి. డ్యూడ్ ముమ్మాటికీ లవ్ టుడే, డ్రాగన్ కంటే మెరుగైన సినిమా కానే కాదు. అయినా ఫెస్టివల్ అడ్వాంటేజ్ లో అలా పని కానిచ్చేసి వసూళ్లు రాబడుతోంది.

ధనుష్, విజయ్ సేతుపతి తరహాలో ప్రదీప్ రంగనాథన్ క్రమంగా నెక్స్ట్ డోర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకునే పనిలో ఉన్నాడు. డిసెంబర్ లో రిలీజ్ కాబోయే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మీద అప్పుడే బజ్ వస్తోందట. విపరీతమైన ఆలస్యం వల్ల ఇప్పటికే లేట్ అయిన ఈ ప్రాజెక్టు నిర్మాతకు ఆర్థికంగా చాలా పెద్ద బరువును మోసేలా చేస్తోంది. ఇప్పుడు క్రమంగా పెరుగుతున్న ప్రదీప్ ఇమేజ్ పుణ్యమాని లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ హాట్ కేక్ లా మారేలా ఉందట. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ వెరైటీ ప్రేమకథలో ఎస్జె సూర్య మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఈ మూవీకి విఘ్నేష్ శివన్ దర్శకుడు.

This post was last modified on October 19, 2025 9:47 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

లేడీ డాన్లకు వార్నింగ్ ఇచ్చిన సీఎం

ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…

50 minutes ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

1 hour ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

2 hours ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

3 hours ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

4 hours ago

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

6 hours ago