ఒక పెద్ద హీరో.. ఒక పెద్ద దర్శకుడి కాంబినేషన్లో సినిమా ఓకే అయిందంటే చాలు రూమర్ రాయుళ్ల పని మొదలైపోతుంది. కాస్టింగ్ గురించే కాక కథ, బడ్జెట్ ఇతర విషయాల గురించి రకరకాల వార్తలు పుట్టించేస్తారు. అందులోనూ ఆ సినిమా పట్టాలెక్కడంలో ఆలస్యం జరిగినా.. మేకింగ్ నెమ్మదిగా జరిగినా వీళ్ల ప్రచారాలు ఇంకా ఎక్కువైపోతాయి.
అల్లు అర్జున్-సుకుమార్‌ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న కొత్త చిత్రం పుష్ప విషయంలో ఇలాంటి రూమర్లు ఎన్ని వినిపించాయో లెక్కే లేదు. ముఖ్యంగా పుష్పలో లీడ్ విలన్ పాత్రకు ఎన్నో పేర్లు వినిపించాయి ఇప్పటిదాకా. నిజానికి ఆ పాత్ర కోసం ముందు విజయ్ సేతుపతిని ఓకే చేసిన మాట వాస్తవం. కానీ డేట్లు సర్దుబాటు చేయలేక ఆయన తప్పుకున్నారు. ఇక అప్పటినుంచి ఆ స్థానంలోకి వచ్చేదెవరన్న చర్చ ఎడతెగకుండా సాగుతూనే ఉంది.
విలన్ పాత్రకు ఎవరినీ ఓకే చేయకుండానే షూటింగ్‌కు వెళ్లిపోయాడు సుకుమార్. తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లిలో ఆయన చిత్రీకరణ సాగిస్తున్నారు. చాలా విరామం తర్వాత షూటింగ్ కావడంతో సుక్కు రెట్టించిన ఉత్సాహంతో, ఎంతో ఏకాగ్రతతో షూటింగ్ చేసుకుంటున్నారు. బన్నీ సహా అందుబాటులో ఉన్న ఆర్టిస్టులతో కొన్ని ముఖ్యమైన ఎపిసోడ్ల చిత్రీకరణ సాగుతోంది.
ఈ షెడ్యూల్ అంతా అయ్యే వరకు ఆయన ఇంకే విషయాలు ఆలోచించదలుచుకోలేదట. ఈ షెడ్యూల్ పూర్తయ్యాక విలన్ పాత్రధారి విషయంలో ఒక నిర్ణయానికి వస్తారని, అప్పుడే వ్యవహారం ఫైనలైజ్ అవుతుందని సమాచారం. కానీ ఈలోపు కొత్తగా విక్రమ్ పేరును పుష్ప విలన్ పాత్రకు ప్రచారంలోకి తెచ్చారు. కానీ సుక్కుకు ఎంతమాత్రం ఆ ఆలోచనే లేదట. ఈ సంగతి చెబితే ఆయన నవ్వుకున్నారట. సుక్కు సహా చిత్ర బృందంలో ఎవ్వరికీ కూడా విలన్ విషయంలో ఇంకా క్లారిటీ లేదన్నది యూనిట్ వర్గాల సమాచారం.
This post was last modified on November 29, 2020 9:49 am
ఈ హైటెక్ జమానాలో 24 గంటల పాటు పలు కంపెనీలు సేవలందిస్తున్నాయి. దీంతో, సాఫ్ట్ వేర్ కంపెనీలు, బీపీవోలలో నైట్…
లావణ్య త్రిపాఠి.. 2012లో విడుదలైన అందాల రాక్షసి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత ఎందరో…
నిన్న చెన్నైలో జరిగిన పుష్ప 2 సాంగ్ లాంచ్ వేడుకలో దేవిశ్రీ ప్రసాద్ ప్రసంగం ఇండస్ట్రీ మొత్తం హాట్ టాపిక్…
వైసీపీకి దశ-దిశ కొరవడిందా? అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకుండా డుమ్మా కొట్టిన ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం…
మంచు విష్ణు హీరోగా తన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న కన్నప్ప ఎట్టకేలకు విడుదల తేదీని…
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఆరు నెలలు దాటిపోయింది. ఫలితాలు వచ్చి కూడా ఆరు నెలలు కావస్తోంది. ఐతే ఆ…