టాలీవుడ్ నిర్మాతల్లో బండ్ల గణేష్‌కు ఫైర్ బ్రాండ్‌గా పేరుంది. ఒకప్పుడు నటుడిగా చిన్న చిన్న పాత్రలు చేసినవాడు.. తర్వాత ఉన్నట్లుండి నిర్మాత అవతారం ఎత్తి భారీ చిత్రాలు ప్రొడ్యూస్ చేశాడు. ‘గబ్బర్ సింగ్’తో ఇండస్ట్రీని షేక్ చేసిన బండ్ల గణేష్.. తర్వాత కొన్నేళ్లకు నిర్మాణానికి దూరం అయిపోయాడు. మళ్లీ సినిమా ప్రొడ్యూస్ చేద్దామని చూస్తున్నాడు కానీ.. కుదరడం లేదు. కానీ సినిమాలు తీయకపోయినా.. ఏదైనా ఈవెంట్‌కు అతిథిగా వచ్చాడంటే మంటలు పుటించే వెళ్తాడు బండ్ల గణేష్.
గత నెలలో ‘లిటిల్ హార్ట్స్’ సక్సెస్ మీట్‌కు వచ్చిన గణేష్.. ఇండస్ట్రీలో మాఫియా గురించి చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. అల్లు అరవింద్, విజయ్ దేవరకొండల ముందే వారి మీద కౌంటర్లు వేసి షాకిచ్చాడు. ఈ కామెంట్లతో తాను నొచ్చుకున్న విషయాన్ని తర్వాత ఇంటర్వ్యూలో బన్నీ వాసు బయటపెట్టాడు. బండ్ల గణేష్ కామెంట్లతో తామంతా ఇబ్బంది పడ్డామని, వైబ్ దెబ్బ తిందని.. గణేష్‌కు స్టేజ్ మీదే సమాధానం చెబుదాం అనుకుని, ఎందుకులే అని ఊరుకున్నానని చెప్పాడు బన్నీ వాసు.
కట్ చేస్తే.. బన్నీ వాసు ప్రొడక్షన్లో వచ్చిన కొత్త చిత్రం ‘మిత్రమండలి’ గురువారం విడుదలైంది. ఈ సినిమాకు ఆశించిన టాక్ రాలేదు. రివ్యూలన్నీ కూడా బ్యాడ్‌గానే వచ్చాయి. అదే టైంలో బండ్ల గణేష్ ఒక ట్వీట్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు.
‘‘అది పీకుతా ఇది పీకుతా అని మనం చెప్పాల్సిన పని లేదు.. మాటలు మన చేతిలో ఉన్నా, ఆట ఎవరిదో జనాలు నిర్ణయిస్తారు’’.. అని ట్వీట్ పెట్టాడు బండ్ల గణేష్.
పేరు పెట్టకపోయినా.. ఈ కామెంట్ బన్నీ వాసును ఉద్దేశించిందే అని తీర్మానించేస్తున్నారు నెటిజన్లు. ‘మిత్రమండలి’కి సంబంధించిన ఇంటర్వ్యూలో బండ్ల గణేష్‌ను విమర్శించడమే కాక.. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో ఈ చిత్రానికి వ్యతిరేకంగా జరుగుతున్న నెగెటివ్ క్యాంపైనింగ్ గురించి బన్నీ వాసు చేసిన కామెంట్లు చర్చనీయాంశం అయ్యాయి. నా వెంట్రుకతో సమానం అంటూ ఆయన చేసిన కామెంట్ వైరల్ అయింది. తన మీద చేసిన విమర్శలకు తోడు.. ఈ కామెంట్‌కు కూడా కౌంటర్‌గా బండ్ల గణేష్ ఆ ట్వీట్ వేశాడని భావిస్తున్నారు.
This post was last modified on October 17, 2025 8:59 am
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…