మెగా యంగ్ హీరో సాయిధరమ్ తేజ్‌కు ఇప్పుడు ఓ పెద్ద హిట్ చాలా అవసరం. యాక్సిడెంట్ తర్వాత నటించిన తొలి చిత్రం ‘విరూపాక్ష’ పెద్ద హిట్టయినా.. తన కెరీర్ వేగం పుంజుకోలేదు. తన మావయ్య పవన్ కళ్యాణ్‌తో తొలిసారి కలిసి నటించిన ‘బ్రో’ నిరాశపరిచింది. యాక్సిడెంట్ తాలూకు ఇబ్బందుల వల్ల గ్యాప్ తీసుకోవడం.. ‘గాంజా శంకర్’ క్యాన్సిల్ కావడంతో తేజు కెరీర్లో గ్యాప్ వచ్చింది.
తర్వాత రోహిత్ కేపీ అనే కొత్త దర్శకుడితో ‘సంబరాల ఏటి గట్టు’ అనే భారీ చిత్రాన్ని మొదలుపెట్టాడు. ‘హనుమాన్’ నిర్మాతలు వంద కోట్లకు పైగా బడ్జెట్లో ఈ సినిమా తీయడానికి రెడీ అయ్యారు. రంగంలోకి దిగాక ఖర్చు అంచనాలను మించిపోయింది. కొన్ని రోజులు టీం సైలెంటుగా ఉండిపోయింది. ఇటీవలే ‘సంబరాల ఏటి గట్టు’ టీజర్ ప్రేక్షకులను పలకరించింది. దానికి పాజిటివ్ ఫీడ్ బ్యాకే వచ్చింది.
అనగనగా ఒక వెనుకబడ్డ ప్రాంతం.. అక్కడో తెగ.. వారి మీద దారుణమైన అకృత్యాలు జరుగుతుంటాయి. అక్కడి జనం అల్లాడిపోతుంటారు. అప్పుడు ఒక రక్షకుడు వచ్చి వారికి నాయకత్వం వహిస్తాడు. వీరోచితంగా పోరాడతాడు. ఇప్పుడు భాషా భేదం లేకుండా ఈ కథలే ట్రెండుగా మారాయి. ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని సృష్టించి హీరోతో రక్షకుడి అవతారం ఎత్తించి భారీ యాక్షన్ ఘట్టాలు, ఎలివేషన్లతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు దర్శకులు.
కాకపోతే వివిధ భాషల్లో గత కొన్నేళ్లలో ఈ తరహా సినిమాలు చాలా వచ్చేశాయి. వీటి డోస్ ఎక్కువైపోయి జనాలకు మొహం మొత్తేసే పరిస్థితి వచ్చింది. ‘సంబరాల ఏటి గట్టు’ టీజర్లో విజువల్స్, భారీతనం, తేజు లుక్, తన డైలాగ్స్ అన్నీ బాగున్నా సరే.. ఇలాంటివి గత కొన్నేళ్లలో చాలా చూసేశాం కదా అనే ఫీలింగ్ కలిగింది. ఇలాంటి కథను తేజు కొన్నేళ్ల ముందు చేయాల్సిందని.. అప్పుడైతే తనకు పెద్ద బ్రేకే వచ్చేదని.. ఇలాంటి సినిమాల డోస్ బాగా ఎక్కువైపోయి ప్రేక్షకులు మొనాటనస్ ఫీలింగ్‌లోకి వచ్చేసిన సమయంలో రానున్న ఈ సినిమా ఎంతమేర వారిని మెప్పిస్తుందో అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
This post was last modified on October 17, 2025 8:52 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…