మాస్ మహారాజా రవితేజ హిట్టు ఫ్లాపు పక్కన పెడితే తనవరకు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో పాటు వీలైనంత ఎక్స్ పరిమెంట్లు చేసేందుకు ట్రై చేస్తూనే ఉన్నారు. ధమాకా లాంటి ఊర మాస్ మూవీ తర్వాత రావణాసురలో నెగటివ్ షేడ్ చేశారు. టైగర్ నాగేశ్వరరావులో పీరియాడిక్ డ్రామా టచ్ చేశారు. ఈగల్ మరో కొత్త తరహా ప్రయత్నం. ఇవన్నీ సక్సెస్ కాకపోవడం వల్ల జనంలోకి వేగంగా వెళ్లలేకపోతున్నాయి. ఒకవేళ వీటిలో సగం విజయవంతమైనా ఇతర బాషల నిర్మాతలు రీమేక్ హక్కుల కోసం ఎగబడే వాళ్ళు. అలాని రవితేజ ప్రయోగాలు ఆపడం లేదు. కొనసాగిస్తూనే ఉంటారని లైనప్ చెబుతోంది.
ముందు మాస్ జాతర తీసుకుంటే ఇది పూర్తిగా ఫ్యాన్స్ కోసం వండుతున్న మాస్ మీల్స్. విక్రమార్కుడు, కిక్, కృష్ణ తరహా హీరోయిజంతో కూడిన ఫన్ ఇందులో బోలెడు ఉంటుంది. డాన్స్ పరంగా శ్రీలీల ఎలాగూ ఉంది కాబట్టి అభిమానులకు కావాల్సిన అన్ని అంశాలు ఉండేలా దర్శకుడు భాను భోగవరపు చూసుకుంటున్నాడు. సంక్రాంతికి రాబోయే కిషోర్ తిరుమల మూవీ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. మాస్ ఎలిమెంట్స్ కన్నా ఎక్కువగా కుటుంబ ప్రేక్షకులను టార్గెట్ చేయబోతున్నారు. భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే టైటిల్ ఆల్రెడీ ప్రచారంలోకి వచ్చేసింది. సో కూల్ ఎంటర్ టైనర్ రాబోతోందన్న మాట.
మజిలీ ఫేమ్ శివ నిర్వాణం డైరెక్షన్లో చేయబోయే సినిమా ఎమోషన్స్ కన్నా ఎక్కువగా థ్రిల్లింగ్, యాక్షన్ మోడ్ లో ఉంటుందని ఇన్ సైడ్ టాక్. వచ్చే నెల షూటింగ్ మొదలుపెట్టొచ్చు. వీటి తర్వాత కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో ఒక సూపర్ హీరో బ్యాక్ డ్రాప్ తో మూవీ చేయబోతున్నారు రవితేజ. కొంచెం ఆలస్యమైనా ప్యాన్ ఇండియా రేంజ్ లో పెద్ద బడ్జెట్ తో తెరకెక్కించేందుకు సితార సంస్థ రెడీ అవుతోంది. రవితేజ ఎప్పుడూ శక్తులు ఉన్న సూపర్ హీరోగా నటించలేదు. ఏది ఏమైనా తనకన్నా చాలా చిన్న వయసు హీరోల కన్నా రవితేజ వేగంగా పరుగులు పెట్టడం చూస్తే ఎవరికైనా స్ఫూర్తే అనిపిస్తుంది.
This post was last modified on October 16, 2025 5:16 pm
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…