ఒకప్పుడు వరుసగా డజనుకు పైగా ఫ్లాపులు ఎదుర్కొని ఇండస్ట్రీ నుంచి అంతర్ధానం అయిపోయే పరిస్థితుల్లో ‘ఇష్క్’ మూవీతో ఊపిరి పీల్చుకున్నాడు నితిన్. ఆ తర్వాత అతను జాగ్రత్తగానే అడుగులు వేశాడు. గుండె జారి గల్లంతయ్యిందే, అఆ, భీష్మ లాంటి విజయాలతో తన కెరీర్ బాగానే సాగింది. కానీ ఆపై మళ్లీ కథ మొదటికి వచ్చేసింది.
‘భీష్మ’ వచ్చి ఐదేళ్లు దాటిపోగా.. తర్వాత ఒక్కటంటే ఒక్క సక్సెస్ లేదు నితిన్‌కు. ఆల్రెడీ ఫ్లాప్ స్ట్రీక్ అరడజనుకు చేరుకుంది. ఓటీటీలో రిలీజై పెద్దగా ఆకట్టుకోని ‘మేస్ట్రో’ను కూడా కలిపితే లెక్క ఏడుకు చేరుతుంది. ఏడాది వ్యవధిలో రాబిన్ హుడ్, తమ్ముడు రూపంలో రెండు భారీ డిజాస్టర్లను ఖాతాలో వేసుకున్నాడు నితిన్. దీంతో ‘తమ్ముడు’ రిలీజ్ కాగానే పట్టాలెక్కాల్సిన ‘యల్లమ్మ’ అతడి చేజారింది.
ఆ తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘ఇష్క్’ తర్వాత ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ చిత్రాన్ని సొంత బేనర్లో నితినే ప్రొడ్యూస్ చేసుకుంటాడని కూడా వార్తలు వచ్చాయి. కానీ తీరా చూస్తే.. ఈ సినిమా కూడా క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. ‘ఇష్క్’ కాంబినేషన్లో రెండో సినిమా వచ్చే అవకాశం లేదట. మరి సమస్య నితిన్ దగ్గర ఉందా.. విక్రమ్ దగ్గరా అన్నది తెలియదు కానీ.. వీళ్లిద్దరూ కలిసి సినిమా చేయట్లేదట.
విజయ్ దేవరకొండతో తన కొత్త చిత్రం చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడట విక్రమ్. యువి క్రియేషన్స్ బేనర్లో ఈ సినిమా తెరకెక్కనుందట. రాహుల్ సంకృత్యన్ సినిమా, రౌడీ జనార్దన్ అయ్యాక విజయ్.. ఈ చిత్రంలో నటిస్తాడట. మరి నితిన్‌కు చెప్పిన కథనే విజయ్ దగ్గరికి తీసుకెళ్లాడా.. ఇది వేరే స్టోరీనా అన్నది క్లారిటీ లేదు. మరి విక్రమ్‌తో కూడా సినిమా లేదంటే.. నితిన్ తన కొత్త చిత్రాన్ని ఎవరితో చేయబోతున్నట్లు? వరుస ఫ్లాపుల నేపథ్యంలో అతనేమైనా బ్రేక్ తీసుకోవాలని భావిస్తున్నాడా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
This post was last modified on October 16, 2025 4:57 pm
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…