మాములుగా దీపావళికి స్టార్ హీరోల సినిమాలు సందడి చేసేవి. కానీ ఈసారి దానికి భిన్నంగా అందరూ కొత్త వాళ్ళు దర్శకత్వం వహించిన నాలుగు యూత్ మూవీస్ బరిలో ఉండటం ఒక రకమైన విచిత్రమైన వాతావరణం ఏర్పరిచింది. దేనికీ భీభత్సమైన బజ్ లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ హాట్ గా లేవు. సిద్ధూ జొన్నలగడ్డ లాంటి క్రేజ్ ఉన్న హీరో నటించిన తెలుసు కదా సైతం ఇప్పుడిప్పుడే బజ్ పెంచుకునే ప్రయత్నాల్లో ఉంది. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ నాటి వేడి కనిపించడం లేదు. ఇది కేవలం జాక్ ఎఫెక్ట్ అని చెప్పలేం. తెలుసు కదా జానర్ తో పాటు కాన్సెప్ట్ కొంచెం క్లిష్టంగా ఉండటం హైప్ పెంచలేకపోయింది.
టీజర్ లో బూతులున్నాయనే కామెంట్స్ తో ప్రమోషన్లు మొదలుపెట్టుకున్న కె ర్యాంప్ మెల్లగా ఆ ముద్రని తగ్గించుకుని ట్రైలర్ తో డ్యామేజ్ రిపేర్ దాదాపు చేసింది. హీరో కిరణ్ అబ్బవరం స్టేట్ మెంట్లు, పక్క భాష హీరో మీద చూపించిన సానుభూతి వగైరాలో సోషల్ మీడియాలో మాట్లాడుకునేందుకు ఉపయోగపడ్డాయి కానీ సినిమా పరంగా ఎంత హెల్ప్ అవుతాయో తేలేది శనివారం రోజే. ఇక ముందు చెప్పుకోవాల్సిన మిత్రమండలి గురించి చివరిగా చెప్పడానికి కారణం క్యాస్టింగ్. ముందు రోజు ప్రీమియర్లకు సిద్ధపడిన ఈ ఎంటర్ టైనర్ మిమ్మల్ని నవ్వుల్లో ముంచెత్తి తీరుతుందని హీరో ప్రియదర్శి బల్లగుద్ది చెబుతున్నాడు.
ఇవన్నీ ఒక ఎత్తయితే తమిళ డబ్బింగ్ డ్యూడ్ కూడా మంచి రిలీజే దక్కించుకుంటోంది. మైత్రి ప్రొడక్షన్ కావడంతో థియేటర్ కౌంట్ బాగానే దక్కుతోంది. ప్రదీప్ రంగనాథన్ కి తెలుగులో మార్కెట్ పెరిగిందనే కోణంలో మంచి విడుదలే చేయిస్తున్నారు. మమిత బైజు హీరోయిన్ కావడం యూత్ పరంగా అదనపు ఆకర్షణ అవుతోంది. నలుగురు డెబ్యూ డైరెక్టర్లు తీసిన ఈ నాలుగు సినిమాల్లో ఎవరు దీపావళి టపాసుల్లా పేలిపోతారో లేక బాక్సాఫీస్ వద్ద వసూళ్ల కలెక్షన్లు పేలుస్తారో ఇంకో మూడు రోజుల్లో తేలిపోతుంది. ఇవాళ అర్ధరాత్రి మిత్రమండలి రూపంలో మొదటి పరీక్ష ఫలితం వచ్చేస్తుంది. చూడాలి బోణీ ఎలా ఉండబోతోందో.
This post was last modified on October 16, 2025 7:06 am
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…