కొత్త సినిమాలకు ప్రెస్ ప్రిమియర్స్ వేయడం, పెయిడ్ ప్రిమియర్స్ కూడా ప్లాన్ చేయడం ఇప్పుడు మామూలు విషయం అయిపోయింది. ‘ఓజీ’ లాంటి భారీ చిత్రంతో పాటు ‘లిటిల్ హార్ట్స్’ లాంటి చిన్న సినిమాకు ముందు రోజు ప్రిమియర్స్ పడ్డాయి. దీపావళి సినిమాల్లో ముందుగా రాబోతున్న ‘మిత్రమండలి’కి కూడా ఒక రోజు ముందే పెయిడ్ ప్రిమియర్స్ వేస్తున్నారు. సినిమా ఫలితం మీద మంచి నమ్మకం ఉన్న వాళ్లు ఇలా చేస్తున్నారు. ఐతే పదేళ్ల ముందు వచ్చిన సినిమాను ఇప్పుడు రీ రిలీజ్ చేస్తూ.. దానికి కూడా స్పెషల్ ప్రిమియర్స్ వేయబోతుండడం విశేషం. ఈ అరుదైన జాబితాలో ‘బాహుబలి: ది ఎపిక్’ చేరబోతోంది.
2015లో వచ్చిన ‘బాహుబలి: ది బిగినింగ్’ను, 2017లో రిలీజైన ‘బాహుబలి: ది కంక్లూజన్’ను కలిపి ‘ది ఎపిక్’ పేరుతో ఈ నెల 31న రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. స్వయంగా రాజమౌళి రంగంలోకి దిగి ఎపిక్ వెర్షన్ రెడీ చేయించాడు. ‘బాహుబలి’ని ఒక కథగా తీస్తే ఎలా ఉండేదో ఈ సినిమాలో చూడబోతున్నాం. ఇందులో కొన్ని సర్ప్రైజులు కూడా ఉంటాయంటున్నారు. రీ రిలీజ్‌ల్లో ‘ది ఎపిక్’ ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని భావిస్తున్నారు. దీని ప్రమోషన్ కూడా వేరే లెవెల్లో జరగబోతోంది.
ఐతే రీ రిలీజ్ డేట్ 31 అయినప్పటికీ.. అంతకు రెండు రోజుల ముందు నుంచే స్పెషల్ ప్రిమియర్స్ వేయబోతున్నారట. తెలుగులో, హిందీలో సెలబ్రెటీ ప్రిమియర్స్ కూడా వేస్తారట. వీటికి ‘బాహుబలి’ టీంలో ముఖ్యులు హాజరయ్యే అవకాశముంది. ఇది ప్రమోషన్ పరంగా బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. రీ రిలీజ్‌లో ‘బాహుబలి: ది ఎపిక్’ను ఐమాక్స్ వెర్షన్లో కూడా రిలీజ్ చేస్తుండడం విశేషం. దాదాపు 3 గంటల 45 నిమిషాల నిడివితో ఈ సినిమా రాబోతోంది.
ఇంత పెద్ద సినిమా అయినా, సాంకేతికంగా అదనపు హంగులు జోడించినా.. నార్మల్ రేట్లతోనే సినిమాను రిలీజ్ చేయాలని టీం నిర్ణయించింది. పాన్ ఇండియా స్థాయిలో వివిధ భాషల్లో భారీగా సినిమాను విడుదల చేయబోతున్నారు. విదేశాల్లో కూడా పెద్ద రిలీజ్ చూడబోతున్నాం. ప్రస్తుతం ఒక మిడ్ రేంజ్ మూవీ పెద్ద హిట్టయితే వచ్చే స్థాయిలో ఈ సినిమా రీ రిలీజ్ వసూళ్లు ఉంటాయని ట్రేడ్ పండిట్లు అంచనా వేస్తున్నారు.
This post was last modified on October 15, 2025 5:52 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…