Movie News

‘కాంతార’తో బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ హిట్స్

రిషబ్ శెట్టి.. మూడేళ్ల ముందు వరకు కన్నడలో ఒక మిడ్ రేంజ్ హీరో కమ్ డైరెక్టర్. తన గురించి కర్ణాటక అవతల పెద్దగా తెలియదు. కానీ ‘కాంతార’తో అంతా మారిపోయింది. కన్నడలో రిలీజైన రెండు వారాల తర్వాత ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో విడుదల చేస్తే అద్భుతమైన స్పందన వచ్చింది. 

ఎవ్వరూ ఊహించని విధంగా రూ.400 కోట్ల వసూళ్లు కొల్లగొట్టి ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అతి పెద్ద సంచనాల్లో ఒకటిగా నిలిచింది. కేవలం రూ.15 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన ఆ చిత్రం.. పెట్టుబడి మీద 25 రెట్లకు మించి వసూళ్లు రాబట్టడం అంటే చిన్న విషయం కాదు. అంతే కాక కర్ణాటకలో ఎవ్వరూ ఊహించని విధంగా ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఫుల్ రన్లో కర్ణాటకలో రూ.180 కోట్ల కలెక్షన్లు రాబట్టిన ‘కాంతార’.. ‘కేజీఎఫ్-2’ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టేసింది.

ఇప్పుడు తాను నెలకొల్పిన రికార్డును మళ్లీ తనే బద్దలు కొట్టాడు రిషబ్ శెట్టి. ‘కాంతార: చాప్టర్-1’.. ‘కాంతార’ పేరిట ఉన్న ఇండస్ట్రీ హిట్ రికార్డును తాజాగా బద్దలు కొట్టేసింది. కర్ణాటకలో ఈ సినిమా గ్రాస్ కలెక్షన్లు రూ.180 కోట్లను దాటిపోయాయి. ఇంతకుముందు ‘కేజీఎఫ్’, ‘కేజీఎఫ్-2’ చిత్రాలతో వరుసగా రెండు ఇండస్ట్రీ హిట్లు ఇచ్చాడు యశ్. ఇప్పుడు ‘కాంతార’, దాని ప్రీక్వెల్‌తో రిషబ్ బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ హిట్లు కొట్టాడు. 

విశేషం ఏంటంటే.. ఈ నాలుగు చిత్రాలనూ నిర్మించింది ఒకే నిర్మాణ సంస్థ. అదే.. హోంబలే ఫిలిమ్స్. కేజీఎఫ్, కాంతార సినిమాలు మొదలైనపుడు అవి అంత  సెన్సేషన్ క్రియేట్ చేస్తాయని.. వాటికి కొనసాంగింపుగా సినిమాలు వస్తాయని.. అవి మరింతగా దేశాన్ని ఊపేస్తాయని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఇలాంటి సినిమాలను నమ్మి ముందే భారీ స్థాయిలో నిర్మించడం హోంబలే ఫిలిమ్స్ ఘనతగానే చెప్పాలి.

This post was last modified on October 15, 2025 5:50 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

లైలా గాయానికి ఫంకీ మందు పని చేస్తుందా

విశ్వక్ సేన్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ లైలా. ఆడవేషం వేసి నరేష్ పాత సినిమా చిత్రం భళారే విచిత్రంలాగా…

1 hour ago

ఒకవేళ కవిత సీఎం అయితే?

#AskKavitha- హ్యాష్ ట్యాగ్‌తో నెటిజ‌న్ల నుంచి అభిప్రాయాలు సేక‌రించిన తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌విత‌.. ఇదే స‌మ‌యంలో ప‌లువురు నెటిజ‌న్లు…

1 hour ago

సూపర్ న్యూస్… సుబ్బులక్ష్మిగా సాయిపల్లవి ?

భారతదేశం గర్వించదగ్గ గొప్ప సంగీత విద్వాంసుల్లో ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి స్థానం ఎవరూ భర్తీ చేయనిది, అందుకోలేనిది. దక్షిణాదిలోనే కాదు…

2 hours ago

పదిరోజుల్లోనే మాట నిలబెట్టుకున్న పవన్

మాటిచ్చిన కేవలం పదిరోజుల్లోనే ఆ హామీని కార్యరూపంలోకి తీసుకువచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌. తొమ్మిది రోజుల క్రితం చిలకలూరిపేట…

4 hours ago

మంచు మనోజ్ సినిమాకు మల్టీస్టారర్ హంగులు ?

నటుడిగా చాలా గ్యాప్ తీసుకున్న మంచు మనోజ్ ఈ ఏడాది రెండు సినిమాల్లో విలన్ గా నటించి కంబ్యాక్ అయ్యాడు.…

4 hours ago

తెలుగు ఐపీఎస్ సూసైడ్ ఎఫెక్ట్.. డీజీపీపై బదిలీ వేటు!

హర్యానాలో పనిచేస్తున్న తెలుగు ఐపీఎస్ అధికారి వై. పూరన్ కుమార్ ఆత్మహత్య ఘటనలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ…

6 hours ago