నిన్ను కోరి, మజిలీ లాంటి ఎమోషనల్ లవ్ స్టోరీస్ తో విజయాలు సాధించిన దర్శకుడు శివ నిర్వాణ, తక్కువ సమయంలో టాప్ డైరెక్టర్ అవుతాడని భావించిన అంచనాలకు భిన్నంగా రెండు ఫ్లాపులతో బాగా నెమ్మదించేశారు. నాని టక్ జగదీశ్ ఓటిటి రిలీజైనా తీవ్రంగా నిరాశపరచగా ఖుషి అతి కష్టం మీద యావరేజ్ దగ్గర ఆగిపోయింది. తన మునుపటి స్థాయి సెన్సిబిలిటీస్ ఈ సినిమాల్లో పూర్తిగా కనిపించలేదన్నది వాస్తవం. ఇదిలా ఉండగా ఖుషి కాకుండా మైత్రి మూవీ మేకర్స్ కి శివ నిర్వాణ గతంలోనే మరో కమిట్ మెంట్ ఇచ్చారు. ఇప్పుడది రవితేజతో ప్రాజెక్టు రూపంలో సాకారం కాబోతోంది. ఈ లీక్ ఆగస్ట్ లోనే వచ్చింది.
తాజాగా వినిపిస్తున్న అప్డేట్ ప్రకారం శివ నిర్వాణ ఈసారి మాస్ రూట్ పట్టబోతున్నారు. అలాని రొటీన్ ఫార్ములాతో రవితేజని బోర్ కొట్టే విధంగా చూపించడం కాదు. ఒక డిఫరెంట్ థ్రిల్లర్ సబ్జెక్టుతో ఊహించని ట్విస్టులతో ఒక కొత్త ఎక్స్ పీరియన్స్ ఇచ్చేలా ట్రీట్ మెంట్ రాసుకున్నారని వినికిడి. ఫాదర్ సెంటిమెంట్, రివెంజ్, ఎమోషన్స్ వీటిని బ్యాలన్స్ చేస్తూ తనలో కొత్త మేకర్ ని పరిచయం చేసే పనిలో శివ నిర్వాణ ఉన్నట్టు సమాచారం. అందుకే కథకు తగ్గట్టు సంగీతం అందించడానికి అజనీష్ లోకనాథ్ ని దాదాపు లాక్ చేసుకున్నట్టు వినిపిస్తోంది. వచ్చే నెల నుంచి షూటింగ్ ప్లాన్ చేస్తున్నారట.
రవితేజ విషయానికి వస్తే మాస్ జాతర అక్టోబర్ 31 విడుదల కానుంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి ( ప్రచారంలో ఉన్న టైటిల్) 2026 సంక్రాంతి బరిలో ఉండటం ఖాయం. వీటి తర్వాత శివ నిర్వాణదే లాక్ అయ్యింది. రవితేజ ఎక్కువ సినిమాలు చేస్తున్న బ్యానర్లలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తర్వాతి స్థానం మైత్రిదే. హీరోయిన్, ఇతర టెక్నికల్ టీమ్ ఎంపికలో శివ నిర్వాణ బిజీగా ఉన్నారట. సాలిడ్ హిట్టు కోసం ఎదురు చూస్తున్న రవితేజ అభిమానులకు కేవలం ఏడాది గ్యాప్ లో మూడు సినిమాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే పండగే.
This post was last modified on October 14, 2025 12:15 pm
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…