టిల్లు బాయ్ సిద్దు జొన్నలగడ్డ ఈ వారమే తెలుసు కదాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ ఏడాది జాక్ తో కొంచెం యాక్షన్ రూటు పడదామని చేసిన ప్రయత్నం ఫలించకపోవడంతో తిరిగి తన స్కూలుకు వచ్చేశాడు. ప్రముఖ డిజైనర్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయమవుతున్న ఈ లవ్ కం రొమాంటిక్ ఎంటర్ టైనర్ కు తమన్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల సహజంగానే అంచనాలు ఏర్పడతాయి. దీపావళి పండగ సందర్భంగా మరో మూడు యూత్ మూవీస్ తో తలపడుతున్న తెలుసు కదా ఇవాళ ట్రైలర్ రూపంలో తన అసలు కంటెంట్ బయట పెట్టింది.
వరుణ్ (సిద్దు జొన్నలగడ్డ) యువతరం ప్రతినిధి. కాకపోతే మహా దూకుడు. అమ్మాయిల చేతికి మన జుట్టు వాళ్ళ కంట్రోల్ లోకి వెళ్ళిపోతాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో లొంగకూడదనుకునే రకం. డాక్టర్ రాగ (శ్రీనిధి శెట్టి) ని చూసి మనసు పారేసుకుని ప్రేమిస్తాడు. ఇంకోవైపు అంజలి (రాశి ఖన్నా) తో ప్రేమాయణం నడిపిస్తాడు. ఒక సందర్భంలో ఇద్దరినీ ఒకే చోటికి చేర్చే విచిత్రమైన పరిస్థితులు కొని తెచ్చుకుంటాడు. అందరూ కలిసి ఉన్నట్టే ఉంటుంది. ముగ్గురూ లవ్ చేసుకుంటారు. కానీ బయటికి చెప్పని ట్విస్టు ఏదో ఈ ట్రయాంగిల్ బంధానికి కారణం అయ్యుంటుంది. అదేంటో తెలియాలంటే అక్టోబర్ 17 దాకా వెయిట్ చేయాల్సిందే.
మాములుగా బాలీవుడ్ లో చూసే మాడరన్ ఏజ్ రిలేషన్ షిప్ ని దర్శకురాలు నీరజ కోన టచ్ చేసినట్టు కనిపిస్తోంది. ఇద్దరు హీరోయిన్ల మధ్య నలిగిపోయే హీరోల కథలు శోభన్ బాబు కాలం నుంచే ఉన్నాయి కానీ తెలుసు కదాలో చాలా డిఫరెంట్ కోణాలు టచ్ చేసిన వైనం స్పష్టం. సిద్దు ఎప్పటిలాగే తన ఎనర్జీతో చెలరేగిపోయాడు. ముఖ్యంగా వైవా హర్షను క్లాసు పీకుతూ చెప్పే డైలాగులు యూత్ కి వెంటనే కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. ట్రైలర్ చివరి షాట్ లో పెట్టిన బూతు డైలాగ్ కొంచెం ఎబ్బెట్టుగానే ఉంది. ఓవరాల్ గా చెప్పాలంటే నిన్నటి దాకా అండర్ కరెంట్ గా ఉన్న తెలుసు కదా ఒక్కసారిగా వోల్టేజ్ పెంచేసుకుంది.
This post was last modified on October 13, 2025 3:13 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…
ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…