గత ఏడాది ‘క’తో బ్లాక్ బస్టర్ కొట్టినట్టు ఈ ఏడాది దీపావళికి మరో విజయం అందుకోవాలని చూస్తున్న కిరణ్ అబ్బవరం కె ర్యాంప్ తో వస్తున్నాడు. ఇప్పటికే రెండు టీజర్లు యూత్ లో సరిపడా అంచనాలు నింపేయగా తాజాగా ట్రైలర్ తో దాన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. జైన్స్ నాని దర్శకత్వంలో రాజేష్ దండా నిర్మాణంలో రూపొందిన ఈ ఎంటర్ టైనర్ అక్టోబర్ 18 విడుదలకు రెడీ అవుతోంది. డ్యూడ్, తెలుసు కదా, మిత్రమండలి లాంటి ఒకే జానర్ సినిమాలతో పోటీ పడుతున్న కె ర్యాంప్ ఫ్రెష్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ కంటెంట్ ద్వారా అసలిందులో ఏం ఎక్స్ పెక్ట్ చేయొచ్చో దాదాపు క్లారిటీ ఇచ్చినట్టే.
బాగా డబ్బున్న కుర్రాడు (కిరణ్ అబ్బవరం) కేరళ కాలేజీలో ఇంజనీరింగ్ చేరతాడు. మందు కొట్టనిదే రోజు గడవని ఎందరో సగటు యూత్ బ్యాచే ఇతను కూడా. కాకపోతే గొడవలు చేయడం, అందరినీ కెలకడం ఇతని స్టైల్. మంచి ముహూర్తంలో ఓ అమ్మాయి (యుక్తి తరేజా) ని ప్రేమిస్తాడు. కానీ తనది ఇతగాడి కంటే విచిత్రమైన మనస్తత్వం. హాస్పిటల్ బెడ్డు మీదే నానా భీభత్సం చేసేంత పిచ్చ ఉంటుంది. మనోడి పాట్లు చూసి తండ్రి, మావయ్య, స్నేహితులు అందరూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. అసలు కె ర్యాంప్ అంటే ఏమిటి, చివరికి అతని లవ్ స్టోరీ ఏ మలుపులు తిరిగి ఎలా క్లైమాక్స్ కు చేరుకుందనేది తెరమీద చూడాలి.
ఎప్పుడూ సెటిల్డ్ గా కనిపించే కిరణ్ అబ్బవరం ఈసారి పూర్తి యూత్ మాస్ లుక్ లోకి వెళ్లిపోవడం కొత్తగా ఉంది. డబుల్ మీనింగులు ఉన్నాయని టీజర్ విషయంలో కామెంట్స్ వచ్చిన నేపథ్యంలో ఈసారి ఆ కంప్లైంట్ రాకుండా జాగ్రత్త పడ్డారు. నరేష్ తో ఇంద్ర స్టెప్పులు వేయించడం, సాయికుమార్ కి ఫన్నీ క్యారెక్టర్ డిజైన్ చేయడం, మురళీధర్ గౌడ్ లాంటి ఆర్టిస్టులను డిఫరెంట్ గా వాడుకోవడం లాంటి స్పెషల్స్ చాలానే కనిపిస్తున్నాయి. పక్కా యూత్ ని టార్గెట్ చేసుకున్న జైన్స్ నాని మొత్తం సినిమాని ఇలాగే చేసి ఉంటే హిట్టు కొట్టడం పక్కా. అసలే చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది. మాట్లాడాల్సింది గెలిపించాల్సింది కంటెంటే.
This post was last modified on October 11, 2025 6:11 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…