పరభాషా నటి అయినా అలాంటి ఫీలింగ్ ఏమీ కనిపించనివ్వకుండా.. మన వాళ్లు సొంత అమ్మాయిలా ఓన్ చేసుకున్న నటి కీర్తి సురేష్. కెరీర్ ఆరంభంలో ఆమె అందరు హీరోయిన్లలో ఒకరిలాగే కనిపించింది కానీ.. ‘మహానటి’ మూవీతో మొత్తం మారిపోయింది. సావిత్రి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించిన కీర్తి.. సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగిపోయింది. ఇక అప్పట్నుంచి కీర్తి ఏ సినిమా చేసినా ఆమె కోసమే ప్రేక్షకులు థియేటర్లకు రావడం మొదలుపెట్టారు.
కానీ ‘మహానటి’ తర్వాత ఆ స్థాయిలో ఆమె మెప్పించిన సినిమాలు తక్కువే. ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ మూవీసే చేస్తూ వచ్చిన కీర్తి.. స్టార్ హీరోల సరసన సర్కారు వారి పాట, దసరా లాంటి చిత్రాల్లోనూ మెరిసింది. ఒక టైంలో తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేస్తూ వచ్చిన కీర్తి.. రెండేళ్లుగా టాలీవుడ్ మీద పెద్దగా ఫోకస్ పెట్టట్లేదు. ‘భోళా శంకర్’లో చిరు చెల్లెలి పాత్రలో నటించిన ఆమెకు చేదు అనుభవం తప్పలేదు. ఆ తర్వాత తెలుగులో తన చిత్రమేదీ థియేటర్లలో విడుదలే కాలేదు. ‘ఉప్పు కప్పురంబు’ అనే సినిమా చేసినా.. అది ఓటీటీలో రిలీజై నిరాశపరిచింది.
తెలుగులో ఒక క్రేజీ మూవీలో కథానాయికగా కీర్తి నటిస్తే చూడాలని కోరుకుంటున్న అభిమానులకు ఎట్టకేలకు ఆ ఆశ తీరింది. స్టార్ హీరో, మంచి పెర్ఫామర్‌గా పేరున్న విజయ్ దేవరకొండకు జోడీగా కీర్తి కనిపించబోతోంది. ఎప్పట్నుంచో వార్తల్లో ఉన్న ‘రౌడీ జనార్దన’ ఎట్టకేలకు మొదలైంది. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ చిత్రాన్ని ‘రాజావారు రాణివారు’, ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ ఫేమ్ రవికిరణ్ కోలా రూపొందించనున్నాడు.
ఓ మంచి హిట్ కోసం ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న విజయ్.. ఈ చిత్రం మీద చాలా ఆశలతో ఉన్నాడు. విజయ్, కీర్తి ఇంతకుముందు ‘మహానటి’లో నటించినా.. అందులో వాళ్లిద్దరి కాంబినేషన్లో సీన్లు ఉండవు. ఇప్పుడు ఇద్దరూ కలిసి నటిస్తుండడం ఇరువురి అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ పెంచుతోంది. ఇది మంచి పెయిర్ అవుతుందనే అంచనాలున్నాయి. మరి టాలీవుడ్ రీఎంట్రీలో కీర్తికి ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.
This post was last modified on October 11, 2025 2:17 pm
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…
నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…
గతంలో అంటే.. 2012 నాటి పరిస్థితులను గమనిస్తే.. జగన్‌కు పెద్ద మైనస్ అనే చెప్పాలి. అప్పట్లో ఆయనపై అక్రమాస్తుల కేసులు…
గత ఎన్నికల్లో ఓడిపోయిన ఒకరిద్దరు టీడీపీ అభ్యర్థులు పట్టు బిగిస్తున్నారు. తమకు మంత్రి నారా లోకేషే ఆదర్శమని కూడా చెబుతున్నారు.…
రాజకీయాల్లో కీలక స్థానాల్లో ఉండే వారి నుంచి వచ్చే మాటల వెనుక ఊహకు అందని లెక్కలు.. సమీకరణాలు ఉంటాయి. అందునా..…