ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ఒకటిగా అల్లు అర్జున్-అట్లీ చిత్రాన్ని చెప్పుకోవచ్చు. ఈ సినిమా గురించి అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన ప్రి విజువలైజేషన్ వీడియో చూసే అందరూ షాకైపోయారు. ఈ సినిమా రేంజే వేరుగా ఉండబోతోందని అర్థమైంది. దీని గురించి ఎవ్వరు మాట్లాడినా ఆహా ఓహో అనే అంటున్నారు.
ఏకంగా 700-800 కోట్ల బడ్జెట్లో హాలీవుడ్ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వీఎఫెక్స్, యాక్షన్ కొరియోగ్రఫీ సహా పలు విభాగాల్లో పదుల సంఖ్యలో ఈ చిత్రానికి హాలీవుడ్ నిపుణులు పని చేస్తున్నారు. ఐతే ఇప్పటిదాకా ఈ సినిమా గురించి బయటి వాళ్లు మాట్లాడ్డమే తప్ప.. మెయిన్ కాస్ట్ అండ్ క్రూ ఎవ్వరూ ఓపెన్ అవ్వలేదు. ఇప్పుడు స్వయంగా దర్శకుడు అట్లీ ఒక ఇంటర్వ్యూలో బన్నీతో తాను చేస్తున్న సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇండియన్ సినిమాలో ఇప్పటిదాకా ఎన్నడూ చూడనిది ఈ చిత్రంలో చూపించబోతున్నామని అతను ఈ ఇంటర్వ్యూలో చెప్పాడు. హాలీవుడ్లో కూడా రెఫరెన్సులు లేని స్థాయిలో ఈ సినిమా కొత్తగా ఉంటుందని అతను చెప్పాడు. ఈ సినిమా తీస్తూ రెఫర్ చేసుకోవడానికి తమ దగ్గర ఏ బైబిల్ లేదని.. అంతా కొత్తగా అనిపించిందని.. తాము నేర్చుకుంటూ సినిమా తీస్తున్నామని అతనన్నాడు.
ఈ చిత్రం అచ్చంగా హాలీవుడ్ సినిమాలాగే ఉంటుందని.. అక్కడి నిపుణులే బోలెడంతమంది ఈ సినిమాకు పని చేస్తున్నారని అట్లీ చెప్పాడు. ఆ టెక్నీషియన్లు సైతం తమకు ఈ సినిమా పెద్ద ఛాలెంజ్ అని చెప్పారని అట్లీ వెల్లడించాడు. ఈ సినిమా నుంచి ఏదైనా విశేషాన్ని ప్రేక్షకులకు చూపిద్దామా అని ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నామని.. అందుకు ఇంకొన్ని నెలలు పడుతుందని అట్లీ చెప్పాడు. బన్నీ లుక్ కొత్తగా ఉంటుందట కదా, ట్రాన్స్‌ఫర్మేషన్ వేరే లెవల్ అట కదా అని అంటే.. కొన్ని నెలలు ఎదురు చూడండి, అందరూ ఎంతగానో ఆశ్చర్యపోతారు అంటూ ఊరించాడు అట్లీ.
This post was last modified on October 11, 2025 1:23 pm
చిన్న సినిమాల్లో విషయం ఉంటే ఆదరణ దక్కి తీరుతుంది. ఈ విషయంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. సీతాకోకచిలుక నుంచి…
బుధవారం ప్రీమియర్లతో గురువారం విడుదల ఎంచుకున్న ది ప్యారడైజ్ ఎట్టకేలకు మొదటి వీకెండ్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రాధమిక సమాచారం…
తెలుగులో లెజెండరీ స్టేటస్ ఉన్న దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకడు. బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న…
ఈ మధ్యకాలంలో కొందరు రాజకీయ నేతలు తమను తాము వేరే లెవల్లో ఊహించుకుంటున్నారు. ప్రజలు ఎన్నుకుంటేనే తాము ప్రజాప్రతినిధులుగా చలామణీ…
గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత.. పార్టీ పుంజుకుంటున్న పరిస్థితి…
రాజమౌళితో సినిమా చేయాలని ఇప్పుడు ఇండియాలో ఉన్న ప్రతి పేరున్న హీరో ఆశపడుతుంటాడు అనడంలో సందేహం లేదు. ఐతే రాజమౌళి…