Movie News

మూడేళ్ల ముందు మూడు సినిమాలు.. ఒకే నెల‌లో రిలీజ్

ఉప్పెన సినిమాతో టాలీవుడ్లోకి సెన్సేష‌న‌ల్ ఎంట్రీ ఇచ్చిన అమ్మాయి కృతి శెట్టి. త‌న రెండో చిత్రం శ్యామ్ సింగ‌రాయ్ సైతం హిట్ట‌యింది. మూడో చిత్రం బంగార్రాజు ప‌ర్వాలేద‌నిపించింది. కానీ ఆ త‌ర్వాత మాత్రం కృతికి షాక్‌ల మీద షాక్‌లు త‌గిలాయి. మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది వారియ‌ర్, క‌స్ట‌డీ, మ‌న‌మే.. ఇలా తెలుగులో ఆమె చేసిన సినిమాల‌న్నీ ఫ్లాప్ అయ్యాయి. దీంతో టాలీవుడ్లో కెరీర్ బాగా డల్ అయిపోయింది. దాదాపుగా ఇక్క‌డ అవ‌కాశాలు ఆగిపోయాయి.

కానీ కోలీవుడ్లో మాత్రం కృతికి మంచి అవ‌కాశాలే వ‌చ్చాయి. మూడేళ్ల కింద‌టే ఆమె మూడు క్రేజీ ప్రాజెక్టుల్లో అవ‌కాశాలు అందుకుంది. కానీ దుర‌దృష్టం ఏంటంటే.. ఆ మూడు సినిమాలూ ఆల‌స్యం అయ్యాయి. త‌న కోలీవుడ్ డెబ్యూ బాగా లేటైపోయింది. ఆ మూడు చిత్రాల్లో ఒక్క‌టి ఇప్ప‌టిదాకా రిలీజ్ కాలేదు. కానీ విశేషం ఏంటంటే.. మూడేళ్ల ముందు మొద‌లైన మూడు చిత్రాలు.. ఇప్పుడు ఒకే నెల‌లో రిలీజ్ కాబోతున్నాయి. ఈ చిత్రాలు కృతి త‌మిళ కెరీర్‌ను నిర్దేశించ‌బోతున్నాయి.

కోలీవుడ్ టాప్ హీరోల్లో ఒక‌డైన కార్తితో కృతి న‌టిస్తున్న చిత్రం.. వా వాతియార్. సూదు క‌వ్వుం చిత్రంతో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన న‌ల‌న్ కుమార స్వామి ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఈ సినిమా గ‌త ఏడాదే విడుద‌ల కావాల్సింది. కానీ ఆల‌స్యం అయింది. అయిన‌ప్ప‌టికీ ఈ సినిమాకు మంచి క్రేజ్ ఉంది. ఈ మూవీ డిసెంబరులో విడుద‌ల కానుంది.

మ‌రోవైపు యువ సంచ‌ల‌నం ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్‌తో కృతి ల‌వ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే చిత్రంలో న‌టించింది. న‌య‌న‌తార భ‌ర్త విఘ్నేష్ శివ‌న్ రూపొందించాడీ సినిమాను. దీనికి పునాది ప‌డింది మూడేళ్ల ముందు అయినా.. సెట్స్ మీదికి వెళ్ల‌డంలో ఆల‌స్యం జ‌రిగింది. షూట్ కూడా లేటైంది. ఈ మూవీ కూడా డిసెంబ‌రులోనే రానుంది.

ఇంకోవైపు జ‌యం ర‌వి స‌ర‌స‌న కృతి జీనీ అనే సినిమాలో న‌టించింది. ఇందులో మ‌ల‌యాళ బ్యూటీ క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ మ‌రో క‌థానాయిక‌. ఇటీవ‌లే ఈ ముగ్గురి మీద తీసిన ఒక సాంగ్ రిలీజ్ చేస్తే అది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఈ మూవీ కూడా డిసెంబ‌రులోనే రిలీజ్ కానుండ‌డం విశేషం. మొత్తానికి డిసెంబ‌రు నెలలో కృతి శెట్టి కెరీర్ అటా ఇటా అన్న‌ది తేలిపోతుంద‌న్న‌మాట‌.

This post was last modified on October 10, 2025 11:18 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

1 hour ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

2 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

3 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

4 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

4 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

6 hours ago