తెలుగు సినీ పరిశ్రమలో ఎవ్వరూ అందుకోలేని స్థాయిని అందుకున్న హీరో మెగాస్టార్ చిరంజీవి. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా పరిశ్రమలోకి అడుగు పెట్టి తన కష్టంతో తిరుగులేని స్టార్‌గా ఎదిగారాయన. ఐతే ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం చిరు శైలి. ఎవరినీ గట్టిగా విమర్శించడం ఆయన వల్ల కాదు. పరుష పదజాలం ఎప్పుడూ వాడడు. రాజకీయాల్లోకి వచ్చాక కూడా ప్రత్యర్థుల్ని గట్టిగా విమర్శించింది లేదు.
రాజకీయాల నుంచి తప్పుకున్నాక అయితే చిరు మరీ సున్నితంగా మారిపోయాడు. ఎవ్వరితోనూ శతృత్వం పెట్టుకోకుండా అందరి వాడు అనిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్య నందమూరి బాలకృష్ణ తనకు గట్టిగా తాకేలా విమర్శలు చేసినా కూడా చిరు స్పందించలేదు. చిరు చిన్న తమ్ముడు పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే.. అతనూ ఒకప్పుడు ఆవేశంగా కనిపించేవాడు. కానీ కాల క్రమంలో పవన్‌లోనూ పరిణతి వచ్చింది. రాజకీయ ప్రత్యర్థుల్ని, తన వ్యతిరేకుల్ని విమర్శించాల్సి వస్తే పవన్ అస్సలు హద్దులు దాటట్లేదు.
కానీ మరో మెగా బ్రదర్ నాగబాబు మాత్రం వీరికి భిన్నం. ఆయనకు ఆవేశం ఎక్కువ. తమను ఎవరైనా టార్గెట్ చేస్తే ఆయన స్పందించే తీరు వేరుగా ఉంటుంది. నిజానికి చిరు, పవన్‌లా మరీ సున్నితంగా, సాత్వికంగా ఉండటం కరెక్ట్ కాదనే అభిప్రాయం కూడా మెగా అభిమానుల్లో ఉంది. అలా అని నాగబాబు లాగా మరీ శ్రుతి మించిపోవడం కూడా కరెక్ట్ కాదనే అభిప్రాయాలూ వ్యక్తమవుతుంటాయి.
ఇంతకముందు నందమూరి బాలకృష్ణకు బదులిచ్చే క్రమంలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు హద్దులు దాటిపోయిన సంగతి తెలిసిందే. కొంత వరకు దాన్ని ఎంజాయ్ చేసిన వాళ్లు కూడా ఆ తర్వాత నాగబాబు దూకుడు తగ్గించాలని అభిప్రాయపడ్డారు. ఇక వర్తమానం విషయానికి వస్తే.. పవన్ రాజకీయంగా తన విధానాల్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటుండటాన్ని తప్పుబడుతూ అతను ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నాడంటూ సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ విమర్శించిన నేపథ్యంలో నాగబాబు స్పందించాడు.
ఇందులో ‘ప్రతి పనికిమాలిన వాడూ విమర్శిస్తున్నాడు’ అంటూ చేసిన కామెంట్ దగ్గరే నాగబాబు స్థాయి పడిపోయింది. ప్రకాష్ రాజ్ రాజకీయంగా తప్పుబట్టిన దానికి అలాంటి దిగ్గజ నటుడిని అంత మాట అనడం ఎంత వరకు కరెక్ట్ అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇక ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు పూర్తిగా రాజకీయ పరమైనవి కాగా.. ఆయన దర్శకుల్ని కాకా పట్టి నిర్మాతల్ని ఏడిపించాడని, డబ్బుల కోసం నిర్మాతల్ని హింస పెట్టాడని.. ఏదో టీవీ చర్చలో సుబ్రహ్మణ్యస్వామి ప్రకాష్ రాజ్‌ను తొక్కి పట్టి నార తీశాడని.. ఇలాంటి వ్యాఖ్యలన్నీ చేశాడు నాగబాబు. ఇవి ఏ రకంగా సందర్భోచితమో నాగబాబుకే తెలియాలి. ప్రకాష్ రాజ్ చేసిన విమర్శలకు సమాధానం చెప్పడం వరకు ఓకే కానీ.. ఇలా వ్యక్తిగత, అనవసర వ్యాఖ్యలు చేయడం ద్వారా నాగబాబు తన అసహనాన్ని బయటపెట్టుకుని విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
This post was last modified on November 28, 2020 2:31 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…