ఒక్కోసారి కొన్ని శుక్రవారాలు డ్రైగా అనిపిస్తే మరికొన్నేమో ఓవర్ కాంపిటేషన్ వల్ల ఏది చూడాలో అర్థం కాని అయోమయాన్ని సృష్టిస్తాయి. ఉదాహరణకు అక్టోబర్ 10 వస్తున్న సినిమాలన్నీ చిన్నవే. దేనికీ హైప్ లేదు. టాక్ వస్తే నిలబడతాయి. లేదంటే లేదు. ఆపై అక్టోబర్ 17 నుంచి 21 మధ్య ఏకంగా ఆరు చెప్పుకోదగ్గ రిలీజులున్నాయి. సిద్ధూ జొన్నలగడ్డ, కిరణ్ అబ్బవరం, ప్రదీప్ రంగనాథన్, ధృవ్ విక్రమ్, రష్మిక మందన్న, ప్రియదర్శి ఇలా నువ్వా నేనానే రేంజ్ లో తలపడుతున్నారు. వీటిలో ఒకటో రెండో రేపు వచ్చి ఉంటే బాక్సాఫీస్ కు కొంచెం ఊపొచ్చేది. కథ ఇక్కడితో అయిపోలేదు. నవంబర్ లోనూ ఇది రిపీటవుతోంది.
వచ్చే నెల మొదటి వారంలో ట్రయాంగిల్ క్లాష్ జరగబోతోంది. మోహన్ లాల్ ప్యాన్ ఇండియా మూవీ ‘వృషభ’ నవంబర్ 6 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. నటుడు శ్రీకాంత్ కొడుకు రోషన్ మేక ఇందులో ఒక ప్రధాన పాత్ర పోషించాడు. ఫాంటసీ, డివోషనల్ ఎలిమెంట్స్ తో రూపొందిన వృషభ చాలా కాలంగా నిర్మాణంలో ఉంది. విఎఫ్ఎక్స్ కు పెద్ద పీఠ వేశారు. సుధీర్ బాబు ‘జటాధర’ ఒకరోజు ఆలస్యంగా నవంబర్ 7 రానుంది. సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కూడా మిరాయ్, కాంతార తరహాలో దైవానికి సంబంధించిన ఎలిమెంట్స్ తోనే రూపొందింది. బడ్జెట్ ఎక్కువే పెట్టారు.
వీటితో పాటు రష్మిక మందన్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ నవంబర్ 7నే రానుంది. చిలసౌ, మన్మథుడు 2 ఫేమ్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ లవ్ థ్రిల్లర్ లో ఎవటూ టచ్ చేయని పాయింట్ ఉంటుందని మేకర్స్ ఊరిస్తున్నారు. ఇక్కడ చెప్పిన మూడు సినిమాలకూ విపరీతమైన బజ్ లేదు. పబ్లిసిటీతో దాన్ని సృష్టించాలి. దానికి ప్రమోషన్లు కీలకం కాబోతున్నాయి. టాలీవుడ్ వరకు చూసుకుంటే ఇవి స్టార్స్ ఉన్న కంటెంట్స్ కాదు కాబట్టి మార్కెటింగ్ ద్వారానే ఓపెనింగ్స్ సాధించాలి. ఆపై తీర్పు ప్రేక్షకుల చేతిలో ఉండబోతోంది. మరి ఈ ముక్కోణపు పోటీలో ఎవరు గెలుస్తారో తెలియాలంటే ఇంకో నెల ఆగాల్సిందే.
This post was last modified on October 9, 2025 5:36 pm
అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…
సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…
చాట్‌జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…
నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్…
ఫౌజీ విడుదల వాయిదా గురించి అసలైన మైత్రి మూవీ మేకర్స్ ఇంకా చెప్పలేదు కానీ మిగిలిన సినిమాలు అలెర్ట్ అయిపోయి…
షాప్‌లో యూపీఐ పేమెంట్ చేయాలంటే ప్రస్తుతం ఫోన్‌లో యాప్ ఓపెన్ చేసి, కెమెరాతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నాం. ఇక…