లవ్ టుడే ముందు వరకు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని పేరు ప్రదీప్ రంగనాథన్. అది సూపర్ హిట్ అవ్వడంతో యూత్ కి ఫాస్ట్ గా కనెక్ట్ అయిపోయాడు. తర్వాత డ్రాగన్ కూడా మంచి విజయం సాధించడంతో ఫ్యాన్స్ మరింత పెరిగారు. ఈసారి డ్యూడ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. పేరుకి తమిళ సినిమా అయినప్పటికీ నిర్మించింది మన తెలుగు నిర్మాతలే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందిన ఈ లవ్ కం యూత్ ఎంటర్ టైనర్ కు కీర్తీశ్వరన్ దర్శకత్వం వహించాడు. అల్లు అర్జున్ – అట్లీ మూవీకి సంగీతం సమకూరుస్తున్న సాయి అభ్యంక్కర్ ఈ డ్యూడ్ కి కంపోజర్ కావడం అసలు విశేషం.
ట్రైలర్ లో కథేంటో ఎక్కువ దాచకుండా చెప్పేశారు. అనగనగా ఒక కుర్రాడు (ప్రదీప్ రంగనాథన్). టిపికల్ ఆటిట్యూడ్ ఉన్న క్యాటగిరీలో నెంబర్ వన్ వచ్చే టైపు. ఇతని విచిత్రమైన మనస్తత్వాన్ని ఒక అమ్మాయి (మమిత బైజు) ఇష్టపడి ప్రేమిస్తుంది. ఆమె నాన్న (శరత్ కుమార్) కు కూడా ఇతను నచ్చేస్తాడు. తీరా పెళ్ళికి వెళ్లే టైంలో ఒక ట్విస్టు ఎదురవుతుంది. కుర్రాడి జీవితం రివర్స్ గేర్ లో వెళ్తుంది. ఈలోగా మరో యువతి (నేహా శెట్టి) పరిచయం వివాహం దాకా వస్తుంది. కానీ ఇదీ జరగదు. అసలు డ్యూడ్ లైఫ్ లో ఇన్ని మిస్టరీలు ఎందుకు జరిగాయి, చివరికి అతను ఏం చేశాడనేది అక్టోబర్ 17 తెలుసుకోవాలి.
డ్రాగన్ ఫార్ములానే ఫాలో అయిన దర్శకుడు కీర్తీశ్వరన్ ఈసారి ప్రదీప్ క్యారెక్టర్ లో డెప్త్ ని మరింత పెంచాడు. అతని బాడీ లాంగ్వేజ్ కి సూటయ్యే డైలాగులు, మ్యానరిజంస్ తో నింపేశాడు. యువతకు వేగంగా కనెక్ట అయ్యే ఇలాంటి ఎలిమెంట్స్ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎలా మెప్పిస్తాయో చూడాలి. ఈసారి విచిత్రంగా హీరోతో పాటు పిల్లనిచ్చే మావయ్య, అత్తయ్యలతో లౌడ్ కామెడీ చేయించిన దర్శకుడు వెరైటీ ప్రయోగాలు చాలానే చేసినట్టున్నాడు. సాయి అభ్యంక్కర్ మ్యూజిక్ అనిరుద్ స్టైల్ లో అనిపించినా ఫ్రెష్ ఫీలింగ్ ఇచ్చింది. మొత్తానికి కుర్రకారులో అంచనాలు రేపడంతో డ్యూడ్ తొలి అడుగు సరిగానే పడిందని చెప్పాలి.
This post was last modified on October 9, 2025 11:26 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…