Movie News

కొత్త ఊపు తెచ్చుకున్న అఖండ 2

బాక్సాఫీస్ వద్ద కాంతార చాప్టర్ 1 ఏ లెజెండ్ వీరవిహారం అఖండ 2 యూనిట్ లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తోంది. అదేంటి రెండు సంబంధం లేని సినిమాలు కదానే డౌట్ వస్తోందా, అక్కడికే వద్దాం. బోయపాటి శీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ డివోషనల్ యాక్షన్ డ్రామాలో ఈసారి దైవత్వానికి సంబంధించిన చాలా సీరియస్ అంశాలు బలంగా జొప్పించారట. ముఖ్యంగా అఘోరాల శక్తులు, హిమాలయాల్లో వాళ్ళ ప్రభావం, సాక్ష్యాత్తు శివుడే కొలువై ఉంటాడని చెప్పుకునే బద్రీనాథ్, కేదార్ నాథ్ లాంటి క్షేత్రాల రెఫరెన్సులతో పాటు పెద్ద బాలయ్యకు సంబంధించి పవర్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ జొప్పించారని టాక్.

విలన్ గా నటిస్తున్న ఆది పినిశెట్టి, బాలకృష్ణల మధ్య జరిగే పోరాట సన్నివేశాలు నెవర్ బిఫోర్ అనే తరహాలో డిజైన్ చేశారట. వీటి విఎఫ్ఎక్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టిన బోయపాటి శీను క్వాలిటీ విషయంలో బెస్ట్ ఇచ్చారని రషెస్ చూసినవాళ్ళ మాట. డబ్బింగ్ సమయంలో చూసిన ఇతర ఆర్టిస్టులు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారని తెలిసింది. ఇంటర్వెల్ తో మొదలుపెట్టి సెకండాఫ్ మొత్తం గూస్ బంప్స్ కంటెంట్ ఉంటుందని ఊరిస్తున్నారు. అఖండలో తొలిసగం తర్వాత నామమాత్రంగా మారిన రెండో బాలయ్య క్యారెక్టర్ ఇప్పుడీ సీక్వెల్ లో పొలిటికల్ టచ్ తో కొత్త తరహాలో ఉంటుందని తెలిసింది.

డిసెంబర్ 5 విడుదలకు రెడీ అవుతున్న అఖండ 2 ప్రమోషన్లు దీపావళి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఇంకో రెండు నెలల కన్నా తక్కువ సమయం ఉండటంతో మిగిలిన పనులను పరుగులు పెట్టిస్తున్నారు. ఈసారి నార్త్ ఇండియా మీద ప్రత్యేక దృష్టి పెట్టి పబ్లిసిటీని గ్రాండ్ గా ప్లాన్ చేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో కాంతార, కార్తికేయ 2 లాంటి సినిమాలకు వచ్చిన ఆదరణని దృష్టిలో పెట్టుకుని వాళ్లకు కావాల్సిన ఎలిమెంట్స్ ఉండేలా బోయపాటి శీను పక్కా స్క్రిప్ట్ రాసుకున్నారట. పోటీ ఉండే అవకాశం తక్కువగా ఉండటంతో డిసెంబర్ మొదటి వారం నుంచి క్రిస్మస్ దాకా అఖండ 2 తాండవం ఓ రేంజ్ లో ఉంటుంది. జస్ట్ టాక్ రావాలంతే.

This post was last modified on October 8, 2025 10:10 pm

Share

Recent Posts

బ్లడీ రోమియోకి లెక్కలు కుదురుతున్నాయి

మాస్ మార్కెట్ ని మరింత బలపరుచుకునే ఉద్దేశంతో నాని ఏరికోరి చేసిన ది ప్యారడైజ్ ఫైనల్ ఫలితం ఏంటనేది ఇంకా…

6 hours ago

డ్రాగన్ మాట మీద నిలబడితే చాలు

ఆ మధ్య షూటింగ్ లో ప్రమాదానికి గురైన జూనియర్ ఎన్టీఆర్ కొన్ని వారాల విశ్రాంతి తర్వాత పూర్తిగా రికవర్ అయ్యాడు.…

6 hours ago

బలహీనపడటాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు

కీలకమైన వీక్ డేస్ పరీక్షలో ప్యారడైజ్ తడబడుతోంది. మొదటి నాలుగు రోజులు ఆదివారం దాకా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడిన…

7 hours ago

ఏపీలో లిక్కర్ క్వాలిటీ చెకింగ్ కు క్యూఆర్ కోడ్!

2019-24 మధ్య జగన్ జమానాలో ఏపీలో నాణ్యమైన మద్యం కరువైన సంగతి తెలిసిందే. తన మంత్రులు, అనుయాయులకు సంబంధించిన డిస్టిలరీల…

9 hours ago

అప్పుడు అనారోగ్యం గుర్తు లేదా అంబటి?

ఏపీ లిక్కర్ రవాణా కుంభకోణం కేసు దర్యాప్తునకు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఏవో కారణాలు చెప్పి…

9 hours ago

తేజ సజ్జ తెలివికి ఇదే నిదర్శనం

యూత్ హీరోలు ప్లానింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఆర్థికంగా ఏమో కానీ కెరీర్ పరంగా ఇబ్బందులు చూడాల్సిన పరిస్థితులు ఇండస్ట్రీలో…

9 hours ago