సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీర రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ వరల్డ్ మూవీకి వారణాసి టైటిల్ అనుకున్నట్టుగా వచ్చిన వార్త సోషల్ మీడియాలో గట్టిగానే తిరుగుతోంది. నిజానికి జక్కన్న ఇంకా ఏ పేరుని లాక్ చేయలేదట. ముందు మహారాజ్ అన్నారు. తర్వాత జెన్ 63 అంటూ కొత్త పేరు బయటికి వచ్చింది. ఇప్పుడీ లిస్టులో వారణాసిని చేర్చారు. ఇన్ సైడ్ టాక్ అయితే కథకు సంబంధించి కాశి కీలక పాత్ర పోషిస్తుంది అని ఆ ప్రాంతం పేరునే పెట్టే ఆలోచన రాజమౌళి చేస్తున్నారట. కానీ ఇంకా ఫైనల్ కాలేదని వినికిడి. ఆర్ఆర్ఆర్ టైంలో ఇలాంటి సందిగ్ధం చవి చూసిన ఆయన చివరికి వర్కింగ్ కోసం పెట్టుకున్న ట్రిపులార్ నే ఖాయం చేసుకున్నారు.
వచ్చే నెల నవంబర్ లో ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అఫీషియల్ లాంచ్ జరగనుంది. రాజమౌళి మీడియా ముందుకు వచ్చి అన్నీ వివరించబోతున్నారు. కాన్సెప్ట్ ని రివీల్ చేసే వీడియో టీజర్ ఉండొచ్చని అంతర్గత సమాచారం. దాంట్లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్విరాజ్ సుకుమారన్ విజువల్స్ ఉంటాయా లేక ఏదైనా యానిమేషన్ తో సరిపుచ్చుతారా అనేది వేచి చూడాలి. రెండోది జరగడానికే ఎక్కువ అవకాశం ఉంది. ఒకవేళ టైటిల్ విషయంలో ఏకాభిప్రాయం రాకపోతే ఇప్పుడప్పుడే రాజమౌళి దాన్ని లాక్ చేయకపోవచ్చు. ఇప్పటిదాకా వచ్చినా వాటిలో జెన్ 63కే గ్లోబల్ అప్పీల్ ఉందనేది వాస్తవం.
సో ఈ సస్పెన్స్ ఇంకొద్ది రోజులు ఇలాగే కొనసాగనుంది. 2027 మార్చి విడుదలను లక్ష్యంగా చేసుకున్న ఎస్ఎస్ఎంబి 29 షూట్ ని వచ్చే వేసవికల్లా పూర్తి చేయాలనేది రాజమౌళి లక్ష్యం. ఆపై పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ల కోసం చాలా ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. అసలే ఈసారి అన్ని దేశాల్లో సమాంతరంగా రిలీజ్ చేయాలనే పట్టుదలతో ఉన్న జక్కన్న ఫారిన్ కొలాబరేషన్స్ చాలానే మాట్లాడుకున్నారట. ఆ వివరాలన్నీ వచ్చే నెల తెలియబోతున్నాయి. కీరవాణి ఇప్పటికే రెండు పాటల రికార్డింగ్ పూర్తి చేశారని అంటున్నారు కానీ నిర్ధారణగా తెలియాల్సి ఉంది. ఈవెంట్ హైదరాబాద్ లో జరిగే అవకాశాలెక్కువగా ఉన్నాయి.
This post was last modified on October 8, 2025 9:28 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…