గత ఏడాది ‘క’తో బ్లాక్ బస్టర్ అందుకున్న కిరణ్ అబ్బవరం ఈ దీపావళికి కె ర్యాంప్ తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ సంవత్సరం దిల్ రుబా షాక్ ఇచ్చినప్పటికీ తిరిగి కంబ్యాక్ అవుతాననే నమ్మకంతో ఫుల్ ఎంటర్ టైన్మెంట్ తో వస్తున్నాడు. బాడీ లాంగ్వేజ్ మార్చుకుని, కేరళలో చదువుకునే తెలుగు స్టూడెంట్ గా ఊర మాస్ క్యారెక్టరైజేషన్ చేశాడు. ప్రమోషన్లు మంచి స్వింగ్ లో ఉన్నాయి. టీజర్, ట్రైలర్ లో వినిపించిన డబుల్ మీనింగ్ డైలాగుల గురించి సోషల్ మీడియాలో మిక్స్డ్ రియాక్షన్లు కనిపించాయి కానీ సినిమా చూశాక వాటి గురించి కంక్లూజన్ కు రమ్మంటున్నాడు. సరే ఇక అసలు విషయానికి వద్దాం.
కిరణ్ అబ్బవరం మన సినిమాలు పక్కరాష్ట్రంలో సరిగ్గా ఆడకపోవడం గురించి ఒక లాజికల్ ప్రశ్న అడుగుతున్నాడు. ప్రదీప్ రంగనాధన్ లాంటి తమిళ హీరోకు తెలుగు రాష్ట్రాల్లో సరిపడా థియేటర్లు దొరుకుతున్నాయి. కానీ అదే తరహాలో తన సినిమాని తమిళనాడులో రిలీజ్ చేద్దామంటే అక్కడి డిస్ట్రిబ్యూటర్లు థియేటర్లు లేవని, ఇవ్వమని చెబుతున్నారట. అంటే మనం ఇంత ప్రేమ చూపించినప్పుడు వాళ్ళు కూడా కాస్త అభిమానం ప్రదర్శించాలి కదానేది కిరణ్ క్వశ్చన్. ఇది నిజంగా ఆవేదన కలిగించేదే. పైగా ఈ సమస్య అతనొక్కడిదే కాదు. పెద్ద ఇమేజ్ ఉన్న టయర్ 2 టాలీవుడ్ స్టార్లు సైతం ఈ ఇబ్బందిని ఎదురుకున్నారు.
దీనికి కారణం ఒకటే. మనం తమిళ డబ్బింగ్ సినిమాలు ఎగబడి కొని చూసినంతగా మనవి వాళ్ళు చూడరు. ఇది ఎప్పటి నుంచో ఉన్నదే. ఆఖరికి తమిళ టైటిల్స్ యధాతథంగా అక్షరం మార్చకుండా, అర్థం కాకుండా పెట్టినా సరే ఇదేంటని అడగకుండా పెద్ద మనసుతో చూసేస్తాం. ఎవరైనా అడిగితే ప్యాన్ ఇండియా మూవీస్ కి ఒకటే పేరు ఉండాలని విచిత్ర సమర్ధింపు హక్కులు కొన్న నిర్మాత నుంచి వినిపిస్తుంది. కిరణ్ చెప్పాడని కాదు, ఇదే ప్రాబ్లమ్ గతంలో చిరంజీవి సైతం ఫేస్ చేశాడని కాదు. ముందు ఏదో ఒక పరిష్కారం దొరికేలా మన టాలీవుడ్ పెద్దలు నడుం బిగించాలి. అప్పుడే తెలుగు సినిమాలు తమిళంలోనూ మంచి రిలీజ్ దక్కించుకుంటాయి.
This post was last modified on October 8, 2025 3:41 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…