ఇప్పటి తరంలో శివరాజ్ కుమార్, రాజ్ కపూర్, డాక్టర్ రాజ్ కుమార్ లాంటోళ్ళు గురించి కొంచెం అవగాహన కలిగి ఉంటారు కానీ బాలీవుడ్ లో చేసింది తక్కువ సినిమాలే అయినా తనదంటూ ప్రత్యేక ముద్ర వేసిన రాజ్ కుమార్ గురించి కూడా తెలుసుకోవాలి. వందేళ్ల క్రితం బలూచిస్తాన్ లో ఉండే కశ్మీర్ పండిట్ కుటుంబంలో జన్మించిన ఈయన ఎస్ఐగా పని చేస్తున్న టైంలో 1952 ‘రంగేళి’ అనే సినిమా ద్వారా తెరంగేట్రం చేశారు. అయిదేళ్ల తర్వాత నర్గిస్ తీసిన ‘మదర్ ఇండియా’ రాజ్ కుమార్ కెరీర్ ని గొప్ప మలుపు తిప్పింది. వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకుండా వక్త్, పైగామ్, దిల్ ఏక్ మందిర్ లాంటి బ్లాక్ బస్టర్స్ తో సూపర్ స్టార్ ని చేసింది.
రాజ్ కుమార్ ముక్కుసూటిగా ఉండేవారు. ఏదైనా మొహం మీద చెప్పేయడం, కోపం వస్తే అణుచుకోకపోవడం ఆయన శైలి. పైగామ్ సినిమాలోని ఒక సన్నివేశంలో సహ నటుడు దిలీప్ కుమార్ తన చెంప మీద గట్టిగా కొట్టాడని ఆగ్రహించిన రాజ్ కుమార్ ఏకంగా ముప్పై సంవత్సరాలకు పైగా ఆయనతో కలిసి నటించనని శపథం చేసి అదే మాట మీద నిలబడ్డారు. 1993లో దర్శక నిర్మాత సుభాష్ ఘాయ్ అతి కష్టం మీద ఒప్పించాక సౌదాగర్ లో చేతులు కలిపారు. అంత మొండిపట్టు ఆయనది. ఎదురుగా ఉన్నది అమితాబ్ బచ్చన్ అయినా సల్మాన్ ఖాన్ అయినా మనసులో ఉన్నది కొట్టినట్టు చెప్పడం ఆయనకు మాత్రమే సొంతమైన శైలి.
వందలోపే సినిమాల్లో నటించినప్పటికీ రాజ్ కుమార్ ఏనాడూ వేషాల కోసం వెంపర్లాడలేదు. ఎక్కువ నటించాలని తాపత్రయపడలేదు. చనిపోయాక సెలబ్రిటీల అంతిమ యాత్రలా తనకు హడావిడి చేయకూడదని ముందే కోరుకోవడంతో 1996లో ఆయన చివరి శ్వాస తీసుకున్నాక కుటుంబ సభ్యులు బయటి ప్రపంచానికి అది తెలియనివ్వకుండా సైలెంట్ గా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. తర్వాత మీడియాకు, పరిశ్రమకు చెప్పారు. బుల్లెట్లు వదిలినట్టు డైలాగులు చెబుతున్నారని పేరున్న రాజ్ కుమార్ చివరి వరకు ఆ బ్రాండ్ ని అలాగే నిలబెట్టుకున్నారు. ఆయన శతజయంతి వేళ అభిమానులకు గుర్తొచ్చే జ్ఞాపకాలు ఎన్నో.
This post was last modified on October 8, 2025 10:23 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…