కోలీవుడ్లో అరంగేట్రానికి ముందే మంచి హైప్ తెచ్చుకున్నప్పటికీ.. తొలి సినిమా విషయంలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో బాగా ఇబ్బంది పడ్డ నటుడు ధ్రువ్ విక్రమ్. లెజెండరీ నటుడు విక్రమ్ తనయుడైన ఈ కుర్రాడిని అర్జున్ రెడ్డి రీమేక్ వర్మతో లాంచ్ చేయాలనుకున్నారు. కానీ సీనియర్ దర్శకుడు బాల తీసిన ఆ సినిమాపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ చిత్రాన్ని ట్రాష్‌లో పడేశారు.
మళ్లీ ఆదిత్య వర్మ పేరుతో అదే సినిమాను అర్జున్ రెడ్డి అసిస్టెండ్ డైరెక్టర్ గిరీశయ్యతో రీమేక్ చేయిస్తే.. అది ఓ మోస్తరు ఫలితాన్నందుకుంది. ధ్రువ్ నటనకు పాజిటివ్ ఫీడ్ బ్యాకే వచ్చింది. తర్వాత తన తండ్రి విక్రమ్‌తో కలిసి మహాన్ మూవీ చేశాడు. ఆ సినిమాలో ధ్రువ్ పాత్రకు, నటనకు మంచి పేరే వచ్చింది. కట్ చేస్తే తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఇప్పుడు బైసన్ అనే సినిమాతో రాబోతున్నాడు. పరియేరుం పెరుమాల్, కర్ణన్, మామన్నన్, వాళై లాంటి గొప్ప సినిమాలు తీసిన మారి సెల్వరాజ్.. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా ప్రోమోలు గొప్పగా అనిపించాయి.
ఐతే దీపావళి కానుకగా ఈ నెల 17న బైసన్ విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్లో ధ్రువ్ చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. తన తొలి రెండు చిత్రాలను ప్రేక్షకులు చూడకపోయినా. పర్వాలేదని.. కానీ బైసన్ మాత్రం కచ్చితంగా చూడాలని.. సినిమాల్లోకి ఇదే తన అసలైన ఎంట్రీ అని భావిస్తున్నానని ధ్రువ్ పేర్కొన్నాడు. ఈ కామెంట్లను చాలామంది తప్పుబడుతున్నారు.. ఇది ఆదిత్య వర్మ, మహాన్ సినిమాలను కించపరచడమే అంటున్నారు. అందులోనూ విక్రమ్‌తో కలిసి చేసిన మహాన్‌ను ఎలా తక్కువ చేసి మాట్లాడతాడు అంటూ ధ్రువ్ మీద విక్రమ్ ఫ్యాన్సే కొందరు నెగెటివ్‌గా స్పందిస్తున్నారు.
తన కామెంట్స్ వివాదాస్పదం కావడంతో మీడియాకు ధ్రువ్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. తొలి సినిమా రీమేక్ కావడం, రెండో చిత్రంలో హీరో విక్రమ్ కావడం, పైగా అది ఓటీటీలో రిలీజ్ కావడంతో తాను అలా మాట్లాడాడని.. రెండేళ్ల పాటు కష్టపడి చేసిన సినిమా కావడం, నటుడిగా తన టాలెంట్ అంతటినీ బయటికి తీసిన చిత్రం కావడంతో బైసన్ మీద ఎక్కువ ప్రేమను చూపించానని.. ఆ రకంగా దీన్ని తొలి సినిమాగా భావించానని.. అంతే తప్ప తన తొలి రెండు చిత్రాలను కించపరిచే ఉద్దేశం తనకు లేదని ధ్రువ్ స్పష్టం చేశాడు.
This post was last modified on October 8, 2025 10:45 am
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీజేపీ అగ్రనేత. ఇక, ఆయన సొంత రాష్ట్రం గుజరాత్. తాజాగా మోడీ చిన్ననాటి స్నేహితుడు,…
విడుదలకు ఇంకా రెండు నెలలు లేని నేపథ్యంలో రామాయణ బృందం సంగీత ప్రచారానికి తెరతీసింది. యూట్యూబ్ కన్నా ముందు స్పాటిఫై…
మొన్న ఢిల్లీ బస్సులో ఓ అమ్మాయిని రేప్ చేస్తే నేడు హైదరాబాద్ లో ఒకరి తర్వాత మరొకరు, ఎక్కడ దొరికితే…
అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నాయి. ఏపీ తెలంగాణ హక్కులు యాభై అయిదు కోట్లకు…
ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఇంతకుముందులా ఉదారంగా కొత్త సినిమాలను కొనట్లేదన్న సంగతి తెలిసిందే. నిర్మాతలు అడుగుతున్న రేట్లకు, వాళ్లు ఆఫర్…
కొందరు దర్శకులు టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంటారు. తమతో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్ పుట్ ఇచ్చే…