Movie News

మీ వయసు ఎంత మెగాస్టార్ గారూ

ఒక మనిషి డెబ్భై ఏళ్ళ వయసుకు వచ్చినప్పుడు కుదురుగా కూర్చుని, టైంకి తిని పడుకుంటేనే పెద్ద అదృష్టమనుకునే ట్రెండ్ లో ఉన్నాం. ఆహారపు అలవాట్లు, వాతావరణం, కాలుష్యం ఇలా రకరకాల అంశాలు తీవ్ర ప్రభావం చూపుతాయి. కానీ ఫిట్ నెస్ మంత్రమో, దేవుడు ఇచ్చిన వరమో ఏమో కానీ కొందరు స్టార్ హీరోలకు మాత్రం అసలు వయసు కాదేమో అనిపిస్తుంది. తాజాగా చిరంజీవి ఒక ఫోటో షూట్ చేయించుకున్నారు. రవి స్టూడియోస్ అనే సంస్థ ఆయన ఇంట్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అయిదారు కాస్ట్యూమ్స్ మార్చి దిగిన ఫోటోలు చూస్తే ఆసలీయన వయసు డెబ్బయ్యా లేక నలభయ్యా అని డౌట్ రావడం సహజం.

ఇటీవలే విడుదలైన మన శంకరవరప్రసాద్ గారులోని మీసాల పిల్ల పాట ప్రోమోలో చిరు స్టైలింగ్, డ్రెస్సులు, లుక్స్ మీద పాజిటివ్ తో పాటు నెగటివ్ కామెంట్స్ కూడా వినిపించాయి. బహుశా వాటికి సమాధానం చెప్పాలనో లేక ఇంకేదైనా కారణమో కానీ మొత్తానికి పిక్స్ అయితే వైరల్ అవుతున్న వైనం సోషల్ మీడియాలో కనిపిస్తోంది. షష్టిపూర్తి వయసు దాటినా చార్మ్ మైంటైన్ చేయడంలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ ఒకరితో మరొకరు పోటీ పడుతున్న వైనం గమనించవచ్చు. ఇప్పటి జనరేషన్ హీరోల్లో ఆ ఏజ్ కు వచ్చేటప్పటికి అసలు యాక్టింగ్ లో ఎంత మంది ఉంటారో చెప్పడం కష్టమే.

భోళా శంకర్ తర్వాత బాగా గ్యాప్ తీసుకున్న చిరంజీవికి వచ్చే ఏడాది కీలకం కానుంది. జనవరిలో మన శంకరవరప్రసాద్ గారు విడుదల కానుండగా విశ్వంభరని వేసవి రిలీజ్ కి రెడీ చేయబోతున్నారు. బాబీ దర్శకత్వంలో రూపొందబోయే యాక్షన్ మూవీ డిసెంబర్ లేదా జనవరి నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదయ్యాక శ్రీకాంత్ ఓదెలతో వయొలెంట్ డ్రామా కోసం కొత్త మేకోవర్ లోకి అడుగు పెట్టబోతున్నారు చిరంజీవి. ఇవి కాకుండా మరో రెండు మూడు చర్చల దశలో ఉన్నాయి. ఏది ఏమైనా మన తెలుగు స్టార్లు కనిపించినంత ఎనర్జిటిక్ గా లేట్ వయసులో ఇంత బాషల హీరోలు కనిపించడం అరుదు.

This post was last modified on October 8, 2025 6:29 am

Share
Show comments
Published by
Kumar
Tags: Chiranjeevi

Recent Posts

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

1 hour ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

1 hour ago

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

2 hours ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

11 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

11 hours ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

12 hours ago