ఒక మనిషి డెబ్భై ఏళ్ళ వయసుకు వచ్చినప్పుడు కుదురుగా కూర్చుని, టైంకి తిని పడుకుంటేనే పెద్ద అదృష్టమనుకునే ట్రెండ్ లో ఉన్నాం. ఆహారపు అలవాట్లు, వాతావరణం, కాలుష్యం ఇలా రకరకాల అంశాలు తీవ్ర ప్రభావం చూపుతాయి. కానీ ఫిట్ నెస్ మంత్రమో, దేవుడు ఇచ్చిన వరమో ఏమో కానీ కొందరు స్టార్ హీరోలకు మాత్రం అసలు వయసు కాదేమో అనిపిస్తుంది. తాజాగా చిరంజీవి ఒక ఫోటో షూట్ చేయించుకున్నారు. రవి స్టూడియోస్ అనే సంస్థ ఆయన ఇంట్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అయిదారు కాస్ట్యూమ్స్ మార్చి దిగిన ఫోటోలు చూస్తే ఆసలీయన వయసు డెబ్బయ్యా లేక నలభయ్యా అని డౌట్ రావడం సహజం.
ఇటీవలే విడుదలైన మన శంకరవరప్రసాద్ గారులోని మీసాల పిల్ల పాట ప్రోమోలో చిరు స్టైలింగ్, డ్రెస్సులు, లుక్స్ మీద పాజిటివ్ తో పాటు నెగటివ్ కామెంట్స్ కూడా వినిపించాయి. బహుశా వాటికి సమాధానం చెప్పాలనో లేక ఇంకేదైనా కారణమో కానీ మొత్తానికి పిక్స్ అయితే వైరల్ అవుతున్న వైనం సోషల్ మీడియాలో కనిపిస్తోంది. షష్టిపూర్తి వయసు దాటినా చార్మ్ మైంటైన్ చేయడంలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ ఒకరితో మరొకరు పోటీ పడుతున్న వైనం గమనించవచ్చు. ఇప్పటి జనరేషన్ హీరోల్లో ఆ ఏజ్ కు వచ్చేటప్పటికి అసలు యాక్టింగ్ లో ఎంత మంది ఉంటారో చెప్పడం కష్టమే.
భోళా శంకర్ తర్వాత బాగా గ్యాప్ తీసుకున్న చిరంజీవికి వచ్చే ఏడాది కీలకం కానుంది. జనవరిలో మన శంకరవరప్రసాద్ గారు విడుదల కానుండగా విశ్వంభరని వేసవి రిలీజ్ కి రెడీ చేయబోతున్నారు. బాబీ దర్శకత్వంలో రూపొందబోయే యాక్షన్ మూవీ డిసెంబర్ లేదా జనవరి నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదయ్యాక శ్రీకాంత్ ఓదెలతో వయొలెంట్ డ్రామా కోసం కొత్త మేకోవర్ లోకి అడుగు పెట్టబోతున్నారు చిరంజీవి. ఇవి కాకుండా మరో రెండు మూడు చర్చల దశలో ఉన్నాయి. ఏది ఏమైనా మన తెలుగు స్టార్లు కనిపించినంత ఎనర్జిటిక్ గా లేట్ వయసులో ఇంత బాషల హీరోలు కనిపించడం అరుదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates