Movie News

శ్రీకాంత్ అడ్డాల.. మళ్లీ బ్రేక్?

‘కొత్త బంగారు లోకం’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు శ్రీకాంత్ అడ్డాల. రెండో చిత్రం ‘ముకుంద’ నిరాశపరిచినా.. మూడో సినిమా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’తో హిట్ అందుకున్నాడు శ్రీకాంత్. మహేష్ బాబు, వెంకటేష్ లాంటి టాప్ హీరోల కలయికలో మంచి సినిమా తీ తీసి.. మళ్లీ మల్టీస్టారర్ ట్రెండు ఊపందుకునేలా చేశాడు. ఆ సినిమాతో పెద్ద స్థాయికి వెళ్లిన శ్రీకాంత్ ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదని అంతా అనుకున్నారు. 

కానీ ‘బ్రహ్మోత్సవం’తో అంతా మారిపోయింది. అది టాలీవుడ్ చరిత్రలోనే ఆల్ టైం డిజాస్టర్లలో ఒకటిగా నిలిచిపోయింది. దీంతో శ్రీకాంత్ కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీ నుంచి అంతర్ధానం అయిపోయాడు. తిరిగి రీమేక్ మూవీ ‘నారప్ప’ చేసినా.. అది పెద్దగా పేరు తీసుకురాలేకపోయింది. ఆపై ‘పెదకాపు’ సినిమా తీస్తే పెద్ద డిజాస్టర్ అయి అడ్డాల కెరీర్‌కు పెద్ద బ్రేక్ పడిపోయింది. మళ్లీ ఇంకో సినిమా చేయడానికి గట్టి ప్రయత్నం చేస్తున్నా కుదరడం లేదు. 

‘కూచిపూడి వారి వీధి’ పేరుతో ఒక స్క్రిప్టు రాసి.. ముందు రానా దగ్గుబాటిని ట్రై చేశాడు. వర్కవుట్ కాలేదు. ఆపై కిరణ్ అబ్బవరం దగ్గరికి ఈ కథ వెళ్లింది. అతను సానుకూలంగానే స్పందించాడు. యువ నిర్మాత ధీరజ్ ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చాడు. ఈ ముగ్గురూ కలిసి కొంత కాలం ట్రావెల్ చేశారు. కానీ ఇప్పుడు నిర్మాత వెనక్కి తగ్గినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు అనుకున్న బడ్జెట్ ఎక్కువ కావడంతో.. అంత ఖర్చుతో సినిమా తీసి వర్కవుట్ చేయడం కష్టమని నిర్మాత వెనక్కి తగ్గాడట. 

కిరణ్‌కు సైతం వేరే కమిట్మెంట్లు ఉండడంతో వెంటనే ఈ చిత్రాన్ని ముందుకు తీసుకెళ్లే స్థితిలో కనిపించడం లేదు. అతను ‘చెన్నై లవ్ స్టోరీ’లో నటిస్తున్నాడు. దీని తర్వాత సుకుమార్ శిష్యుడు వీరా కోగటం దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇది కాక సొంత బేనర్లో ఓ డెబ్యూ డైరెక్టర్‌తో ఒక సినిమాకు కమిటయ్యాడు. వీటి సంగతి చూశాకే అడ్డాల సినిమా గురించి ఆలోచించాలని కిరణ్ ఫిక్సవడంతో అడ్డాల సినిమా ఇప్పట్లో ముందుకు కదిలే అవకాశం లేదని తెలుస్తోంది.

This post was last modified on October 7, 2025 9:19 pm

Share

Recent Posts

బీసీ రిజర్వేషన్లపై తేల్చేసిన సుప్రీం

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…

15 minutes ago

తీరం చేరని ఏజెంట్ దర్శకుడి కలలు

ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…

23 minutes ago

ఫౌజీ ప్లాన్ మారడం వెనుక ఏం జరిగింది

ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…

1 hour ago

తమన్ ఈసారి నెగిటివిటీని దాటేయాలి

టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…

2 hours ago

పండగ బోణీ చేయాల్సింది కళ్యాణే

పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…

2 hours ago

5 కోట్ల వ‌ర‌కు జీఎస్టీ ఎగ్గొట్టారా…

వస్తు, సేవ‌ల ప‌న్ను.. జీఎస్టీ విధానంలో కీల‌క మార్పులు చేయ‌నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రైనా వ్యాపారులు పారిశ్రామిక వేత్త‌లు.. జీఎస్టీ…

5 hours ago