Movie News

రాజమౌళి ‘ఎపిక్’ ప్లానింగ్ అదరహో

సరిలేరు నీకెవ్వరు అనే పదం రాజమౌళికి అతికినట్టు సరిపోతుంది. మాములుగా రీ రిలీజ్ సినిమా అంటే సదరు దర్శక నిర్మాతలు ఒక ప్రెస్ మీట్ పెట్టేసి దాని కబుర్లు పంచుకుని అక్కడితో మమ అనిపిస్తారు. మహా అయితే ఒక ఇంటర్వ్యూ ఇస్తారు. అలా చేస్తే జక్కన్నకు మిగిలిన వాళ్లకు తేడా ఏముంటుంది. అక్టోబర్ 31 విడుదల కాబోతున్న బాహుబలి ది ఎపిక్ కోసం రాజమౌళి టీమ్ పడుతున్న కష్టం, పర్ఫెక్షన్ కోసం తపిస్తున్న విధానం మాములుగా లేవు. నెట్ ఫ్లిక్స్ లో బాహుబలి బిగినింగ్, కంక్లూజన్ హిందీ ఇంగ్లీష్ వెర్షన్లు తీసేయడం ద్వారా ఆడియన్స్ కో స్వీట్ షాక్ ఇచ్చారు. తెలుగు అయితే ప్రస్తుతానికి హాట్ స్టార్లో అందుబాటులో ఉన్నాయి.

ఐమాక్స్ తో పాటు వివిధ ఫార్మాట్లలో విడుదలవుతున్న బాహుబలి ఎపిక్ కోసం ఎడిటింగ్ రూమ్ లో అన్నీ దగ్గరుండి చూసుకుంటున్న రాజమౌళి స్క్రీన్ యాస్ పెక్ట్ రేషియోతో మొదలుపెట్టి కలర్ గ్రేడింగ్ దాకా ప్రతిదీ తన పర్యవేక్షణలో ఉండేలా చూసుకుంటున్నారు. ఆల్రెడీ క్యాస్టింగ్, టెక్నికల్ టీమ్ తో కొన్ని ఇంటర్వ్యూలు షూట్ చేశారు. ఘాటీ ప్రమోషన్లకు బయటికి రాని అనుష్క ఇప్పుడీ బాహుబలి ఎపిక్ కోసం కెమెరా ముందుకొచ్చిందని ఇన్ సైడ్ టాక్. ఇది కూడా ఒక రకమైన మినీ సెన్సేషన్. ప్రభాస్, రానా, సత్యరాజ్, రామకృష్ణ తదితరుల ప్రోగ్రాంస్ తో పాటు మేకింగ్ వీడియోస్ వదలబోతున్నారు.

ఇంత శ్రద్ధగా రీ రిలీజ్ చేయడం వెనుక రాజమౌళి లక్ష్యం ఒక్కటే. బాహుబలి ది ఎపిక్ ని ఒక స్టాండ్ అలోన్ మూవీగా కొత్తగా ప్రేక్షకులకు పరిచయం చేయడమే. రెండు భాగాలు కొన్ని వందలసార్లు చూసిన అభిమానులు సైతం ఫ్రెష్ గా ఫీలయ్యేలా కొత్త వెర్షన్ వచ్చిందట. మూడున్నర గంటల నిడివి లాక్ చేసినట్టు తెలిసింది. ప్రభాస్ ఫ్యాన్స్ భారీ ఎత్తున సెలబ్రేషన్స్ కోసం రెడీ అవుతున్నారు. కల్కి 2898 ఏడి వచ్చి ఏడాది దాటేసింది. కన్నప్పలో క్యామియో కావడంతో లైట్ తీసుకున్నారు. రాజా సాబ్ రావడానికి ఇంకా మూడు నెలల టైం ఉంది. సో బాహుబలి థియేటర్లలో సంబరాలు ఓ రేంజ్ లో ఉండబోతున్నాయి.

This post was last modified on October 4, 2025 3:19 pm

Share

Recent Posts

లెజెండరీ నటుడు నానా పటేకర్ కన్నుమూత!

ప్రముఖ నటుడు నానా పటేకర్ గురువారం కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే సమీపంలోని…

12 minutes ago

‘రణబాలి’ నేర్చుకున్న ‘ప్యారడైజ్’ పాఠం

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమాకు రిలీజ్ ముందు రోజు రాత్రి…

48 minutes ago

ఖైదీకి గోల్డ్ మెడల్.. జైల్లోనే చదివి డిగ్రీలో టాప్‌!

కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి విద్యపై ఆసక్తి, పట్టుదల తోడైంది. దీంతో చదువులో అత్యుత్తమ ఫలితాలను సాధించి ఇతర ఖైదీలకు…

2 hours ago

చీరలో పరిగెత్తి చరిత్ర సృష్టించిన కవిత

జీవితం అన్నీ నేర్పిస్తుంది. కష్టాలు ఎలా జీవించాలో నేర్పిస్థాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కవిత కుమారి. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా,…

2 hours ago

ఈసారి అంత ఈజీ కాదు శ్రీకాంత్

మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…

7 hours ago

కరెంటు లేని కాలం కావాలంటున్న డైరెక్టర్

ఇప్పుడు డబ్బుతో పాటు అన్ని సౌకర్యాలూ ఉన్నా సరే.. ఏమీ లేని ఒకప్పటి రోజులే బాగున్నాయి అనుకునేవాళ్లు చాలామందే ఉంటారు.…

8 hours ago