Movie News

తెలుగు కమెడియన్ ట్వీట్లు.. రచ్చ రచ్చ

‘అర్జున్ రెడ్డి’తో మంచి పేరు సంపాదించి టాలీవుడ్ స్టార్ కమెడియన్లలో ఒకడిగా ఎదిగిన రాహుల్ రామకృష్ణ.. ఎక్స్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటూ అప్పుడప్పుడూ సామాజిక, రాజకీయ అంశాల మీద అప్పుడప్పుడూ హాట్ హాట్ పోస్టులు పెడుతుంటాడు. అందులో కొన్ని తీవ్ర వివాదం రేపుతుంటాయి కూడా. ఇప్పుడు అలాంటి ట్వీట్లతోనే రాహుల్ రామకృష్ణ మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. 

తెలంగాణలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద ఘాటు విమర్శలు చేస్తూ.. మళ్లీ రాష్ట్రాన్ని ఆదుకోవడానికి కేసీఆర్ రావాలి అంటూ అతను పోస్టు పెట్టడం పెద్ద దుమారమే రేపింది. రాజకీయాల్లో లేని ఒక నటుడు ఇలాంటి పోస్ట్ పెట్టడం అరుదైన విషయమే. దీంతో పాటుగా గాంధీ జయంతి రోజు గాంధీకి వ్యతిరేకంగా కూడా అతనో పోస్టు పెట్టాడు. అది కూడా తీవ్ర వివాదాస్పదం అయింది. ఐతే కొన్ని గంటల్లోనే రాహుల్ ట్విట్టర్ అకౌంట్ డీయాక్టివేట్ అయిపోవడం గమనార్హం.

ముందుగా ‘‘హైదరాబాద్ మునిగిపోయింది. మీ హామీలన్నీ విఫలమయ్యాయి. అన్నీ చక్కదిద్దడం కోసం జనాలు కేసీఆర్ మళ్లీ రావాలని కోరుకుంటున్నారు’’ అని ఒక పోస్టు పెట్టాడు. తర్వాత ‘‘మనం దారుణమైన పరిస్థితుల్లో బతుకుతున్నాం. మీరు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాం’’ అని మరో పోస్టు పెట్టి.. ‘‘నన్ను చంపేస్తారా చంపేయండి. జరుగుతున్న పరిణామాలతో అలసిపోయాను’’ అని కామెంట్ జోడించాడు రాహుల్. 

మరోవైపు గాంధీజయంతి సందర్భంగా గాంధీ గురించి మాట్లాడుతూ.. ఆయన సాధువు కాదని, మహాత్ముడు కాదని నొక్కి వక్కాణించాడు రాహుల్. ఈ పోస్టులు తీవ్ర దుమారానికి దారి తీశాయి. కాంగ్రెస్ వాళ్లు, గాంధీ అభిమానులు రాహుల్‌పై విరుచుకుపడ్డారు. కొన్ని గంటల్లో రాహుల్ ట్విట్టర్ అకౌంట్ డీయాక్టివేట్ అయిపోయింది. తన అకౌంటును ఎవరో హ్యాక్ చేశారంటూ రాహుల్ చెబుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ వాళ్లు అతణ్ని బెదిరించి అకౌంట్ డీయాక్టివేట్ చేసుకునేలా చేసినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. మరి ఇందులో ఏది వాస్తవమో తెలియాల్సి ఉంది.

This post was last modified on October 3, 2025 3:32 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Rahul

Recent Posts

‘పరదాల్లో పవన్’ అన్న వైసీపీ ఇప్పుడేమంటుందో?

ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…

2 hours ago

చైతూ వివాహ వార్షికోత్సవం… దర్శకుడి పోస్టు వైరల్

ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్‌‌గా పెళ్లి చేసుకుంది ఈ…

2 hours ago

కోహ్లీ… 2,462 రోజుల సెంటిమెంట్ బ్రేక్

విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో…

2 hours ago

ఉభయకుశలోపరి… తెలంగాణ ‘అఖండ’ 2 ధరలు

ఎప్పుడూ లేనిది ఒక పెద్ద హీరోకు తెలంగాణ టికెట్ రేట్ల పెంపు బాగా ఆలస్యమయ్యింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో…

2 hours ago

అఖండ హీరోయిన్ ను ఎందుకు తీసేసారో లీక్ చేసిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’లో ప్రగ్యా జైశ్వాల్  కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.…

3 hours ago

టికెట్ రేట్లలో పెంచిన 100 రూపాయల్లో నిర్మాతకి వచ్చేది అంతేనా?

తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరల పెంపు గురించి ఇటీవల పెద్ద చర్చే జరుగుతోంది. ఆల్రెడీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పెరుగుతున్న…

3 hours ago