Movie News

జాన్వీ కపూర్ ఇక జాగ్రత్త పడాల్సిందే

ఒకపక్క టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి అగ్ర హీరోల సరసన ఆఫర్లు పడుతున్న బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ అటు హిందీలో టయర్ 2 స్టార్లతో జట్టు కడుతూ వరస ఫ్లాపులు మూటగట్టుకుంటోంది. పెర్ఫార్మన్స్ పరంగా తన వంతు లోపం ఏమీ లేకపోయినా సబ్జెక్టు సెలక్షన్ లో చేస్తున్న తప్పుల వల్ల గుర్తుండిపోయే సినిమాలు రావడం లేదు. ఆ మధ్య పరం సుందరి ఏం చేసిందో చూశాం. తాజాగా సన్నీ సంస్కారికి తులసి కుమారితో నిన్న థియేటర్లలో అడుగు పెట్టింది. రెండు పాటలు, కాసింత కామెడీ తప్ప మిగిలినదంతా రొట్ట రొటీన్ వ్యవహారమంటూ క్రిటిక్స్ ఈ మూవీ గురించి గట్టిగా తలంటేశారు.

వరుణ్ ధావన్ హీరోగా నటించిన సన్నీ సంస్కారికి తులసి కుమారిలో ఎంటర్ టైన్మెంట్ ని ప్రధానంగా టార్గెట్ చేసుకున్నారు కానీ అది ఎంత రెగ్యులర్ గా వెళ్తోందో దర్శకుడు శశాంక్ కేతన్ గుర్తించకలేకపోయాడు. కథగా చూసుకుంటే సన్నీ (వరుణ్ ధావన్) అనే కుర్రాడికి ప్రాణంగా ప్రేమించిన గర్ల్ ఫ్రెండ్ (సన్యా మల్హోత్రా)  హ్యాండ్ ఇచ్చి బాగా డబ్బున్న వాడిని పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకుంటుంది. దీంతో ఒళ్ళు మండిన సన్నీ ఆ పెళ్లి కొడుకు ఇష్టపడిన తులసి (జాన్వీ కపూర్) అనే అమ్మాయితో చేతులు కలుపుతాడు. కొత్త జంటకు బుద్ది చెప్పాలని డిసైడై ఒక ప్లాన్ వేసుకుంటారు. దాన్ని తెరమీదే చూసి తరించాలి.

అవుట్ డేటెడ్ ట్రీట్ మెంట్ తో సన్నీ సంస్కారికి తులసి కుమారి అధిక శాతం విసుగు తెప్పిస్తుంది. ప్రతి సన్నివేశం ఈజీగా ముందే ఊహించేలా స్క్రీన్ ప్లే సాగడం ప్రధానమైన మైనస్. జాన్వీ, సాన్య పోటీపడి నటించినప్పటికీ పాత చింతకాయ పచ్చడి స్టోరీలో అవి కొట్టుకుపోయాయి. ఇలాంటి సినిమాలు వందలు చూసినా కూడా మాకు బోలెడు ఓపిక ఉందనుకునే ప్రేక్షకులు ట్రై చేయొచ్చు కానీ లేదంటే మాత్రం చుక్కలు కనిపించడం ఖాయం. ఓ మోస్తరు డీసెంట్ ఓపెనింగ్స్ తెచ్చుకున్న సన్నీ సంస్కారికి తులసి కుమారి అద్భుతాలు చేయడం డౌటే. కరణ్ జోహార్ ప్రొడక్షన్ వేల్యూస్ తప్ప చెప్పుకోవడానికి ఏం లేదు.

This post was last modified on October 3, 2025 2:16 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Janhvi

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

2 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

5 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

5 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

7 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

9 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

10 hours ago