తెలుగు సినీ పరిశ్రమకు అతిపెద్ద ముప్పుగా నిలుస్తున్న పైరసీ వెబ్‌సైట్‌లలో ఐబొమ్మ పేరు ముందుంటుంది. కొత్త సినిమాలు థియేటర్లలో విడుదలైన కొద్ది గంటల్లోనే ఈ వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమవుతున్నాయి. దీని వలన నిర్మాతలకు కోట్ల రూపాయల నష్టం కలుగుతోంది. పోలీసులు, సైబర్ క్రైమ్ విభాగం క్రమం తప్పకుండా చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఇప్పటికీ ఐబొమ్మ వెనుక ఉన్న వారిని పట్టుకోవడంలో విఫలమవుతున్నారు. దీంతో సాధారణ ప్రజల మనసులో సహజంగానే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.. ఈ బూతాన్ని ఎప్పుడు ఆపగలరు? అసలు వారిని పట్టుకోవడం ఎందుకంత కష్టం? అనే సందేహం రాకుండా ఉండదు.
గతంలో ఇలాంటి అనేక పైరసీ వెబ్‌సైట్‌లపై పోలీసు దాడులు జరిగాయి. ‘తమిళ్ రాకర్స్’, ‘మూవీస్‌డా’, ‘జాలీ మూవీ’ వంటి సైట్లు మూసివేసినా, కొద్ది రోజుల్లోనే వేరే పేర్లతో తిరిగి వచ్చేశాయి. అదే పరిస్థితి ఇప్పుడు ఐబొమ్మతోనూ కనిపిస్తోంది. ఒకసారి బ్లాక్ చేసినా, వెంటనే కొత్త డొమైన్‌లో మళ్లీ ప్రారంభమవుతోంది. అంతర్జాలంలో వందలాది డొమైన్‌లు ఉండటం, సర్వర్లు విదేశాల్లో ఉండటం వల్ల పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది.
సైబర్ నిపుణుల వివరణ ప్రకారం, ఇలాంటి సైట్లు ఎక్కువగా అనామక సర్వర్లను ఉపయోగిస్తాయి. సాధారణంగా వీటి ఆపరేటర్లు VPNలు, ప్రాక్సీలు ఉపయోగించి తమ ఐపీలను దాచేస్తారు. మరోవైపు, బిట్‌కాయిన్ వంటి డిజిటల్ చెల్లింపుల ద్వారా ప్రకటనల ఆదాయం పొందుతున్నారు. అందువల్ల వారిని ట్రాక్ చేయడం చాలా కష్టం అవుతుంది. అంతేకాకుండా, వీరి ప్రధాన కేంద్రాలు భారతదేశంలో కాకుండా ఇతర దేశాల్లో ఉండటం వల్ల చట్టపరమైన అడ్డంకులు వస్తాయి.
అయితే పోలీస్ యంత్రాంగం పూర్తిగా చేతులు ఎత్తేసినట్లు కనిపించడం లేదు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, ఐటీ చట్టాల కింద ఈ రాకెట్‌ను ఛేదించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. కానీ సమస్య ఏమిటంటే, ఒక వెబ్‌సైట్‌ను మూసేసినా, వెంటనే మరో కొత్త డొమైన్ తెరుచుకోవడం. దీంతో పూర్తి స్థాయిలో పైరసీని అదుపులోకి తెచ్చే అవకాశం చాలా తక్కువగానే ఉందని నిపుణులు చెబుతున్నారు.
మొత్తానికి ఐబొమ్మ లాంటి పైరసీ సైట్లను మూసివేయడం ఒక్క పోలీసులతో సాధ్యం కాదు. దీనికి ప్రభుత్వాల మధ్య సహకారం, కఠిన చట్టాలు, టెక్నాలజీ సహాయం అవసరం. ప్రజలు కూడా ఇలాంటి సైట్ల ద్వారా సినిమాలు చూడకుండా నిరాకరిస్తేనే ఈ బూతం ఆగుతుంది. లేదంటే, పేర్లు మారినా, రూపాలు మారినా పైరసీ వెబ్‌సైట్‌లు మళ్లీ మళ్లీ పుట్టుకురావడం తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
This post was last modified on October 2, 2025 10:24 am
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్‌గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…