సెలబ్రెటీల్లో కూడా పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకున్న స్టార్లలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకడు. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు కూడా పవన్‌కు పెద్ద అభిమానే. పవన్ సినిమా తొలి ప్రేమతోనే డిస్ట్రిబ్యూటర్‌గా ఆయన కెరీర్ మలుపు తిరిగింది. ఆ సినిమాతో నిలదొక్కుకుని, ఆ తర్వాత నిర్మాతగానూ మారాడు. పవన్‌తో సినిమా చేయాలని లక్ష్యం పెట్టుకుని వకీల్ సాబ్ మూవీతో ఆ కలను నెరవేర్చుకున్నాడు. సందర్భం వచ్చినపుడల్లా పవన్ మీద తన అభిమానాన్ని చాటుకునే దిల్ రాజు.. పవర్ స్టార్ కొత్త చిత్రం ఓజీ సక్సెస్ సెలబ్రేషన్లలో పాల్గొని తన అభిమాన కథానాయకుడికి ఫ్యాన్స్ తరఫున ఒక విన్నపం చేశాడు.
పవన్ రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. ఏడాదిలో కొంత సమయాన్ని వీలు చేసుకుని ఒక సినిమా చేయాలని కోరాడు దిల్ రాజు. ఇది తనతో పాటు అభిమానులందరి కోరిక అని, ఆయన సినిమాలకు దూరం కావొద్దని ఆయన వ్యాఖ్యానించాడు. పవన్ కళ్యాణ్ తనకు ఎప్పుడూ ఇన్‌స్పిరేషనే అని దిల్ రాజు ఈ సందర్భంగా చెప్పాడు. కళ్యాణ్ సినిమా కెరీర్లో ఫెయిల్యూర్లు చూసినా తట్టుకుని నిలబడ్డాడని.. అలాగే రాజకీయాల్లో కూడా వైఫల్యాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారని.. తాను కూడా నిర్మాతగా అపజయాలు ఎదురైనపుడల్లా పవన్‌నే స్ఫూర్తిగా తీసుకుని ధైర్యంగా ముందుకు సాగుతుంటానని దిల్ రాజు చెప్పారు.
తొలి ప్రేమ నుంచి కళ్యాణ్‌కు తాను అభిమానినని ఆయన తెలిపారు. ఓజీ సినిమాను ఒక అభిమానిగా ఎంతో ఎంజాయ్ చేశానని.. తన లాంటి ఫ్యాన్స్ కళ్యాణ్‌ను ఎలా చూడాలనుకుంటారో అలా చూపించిన సుజీత్.. అందరినీ ఉర్రూతూలగించాడని దిల్ రాజు వ్యాఖ్యానించాడు. తమన్ ఈ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడని.. సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరూ బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చారని.. ఆర్ఆర్ఆర్ తర్వాత నిర్మాత దానయ్య పెద్ద హిట్ ఇచ్చినందుకు డిస్ట్రిబ్యూటర్లు అందరి తరఫున తాను థ్యాంక్స్ చెబుతున్నానని దిల్ రాజు అన్నాడు.
This post was last modified on October 1, 2025 11:12 pm
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…