మొదటి వారం కాకుండానే 250 కోట్ల గ్రాస్ దాటేసిన ఓజి అంచనాలకు మించి ఆడటం టీమ్ నే కాదు మొత్తం మెగా ఫ్యామిలీనే సంతోషంలో ముంచెత్తింది. కుటుంబం మొత్తం ఒక సినిమాని కలిసి చూడటం గత కొన్నేళ్లలో చిరంజీవికి కూడా జరగలేదు. వాల్తేర్ వీరయ్య లాంటివి విడివిడిగా చూసుకున్నారు కానీ ఇలా గంపగుత్తగా వెళ్ళలేదు. దానికి తోడు షో అయ్యాక పవన్ కళ్యాణ్ స్వయంగా ఓజి యునివర్స్ కోసం ఎదురు చూస్తున్నానని చెప్పడంతో దర్శకుడు సుజిత్, సంగీత దర్శకుడు తమన్ ఆనందం అంతా ఇంతా కాదు. ఇవాళ హైదరాబాద్ లో జరిగిన సక్సెస్ మీట్ లో మరోసారి ఈ ప్రస్తావన వచ్చింది.
సుజిత్ మాట్లాడుతూ ఓజి హిట్టవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానని, అయితే తన కోసం కాకుండా ఇది సక్సెస్ అయితే పవన్ కళ్యాణ్ సార్ తో మళ్ళీ పని చేసే అదృష్టం ఇంకోసారి దొరుకుతుందనే ఆశతో ఇదే మాట వ్యక్తిగతంగా చెప్పానని షూటింగ్ స్పాట్ జ్ఞాపకం ఒకటి పంచుకున్నాడు. అయితే పవన్ దాని గురించి స్పందిస్తూ సంజ్ఞల ద్వారా నేను చెప్పలేదు, నేను చేయలేను అనే తరహాలో అన్న మాటలు వీడియోలో కనిపించాయి. నిజంగా ఆయన అదే అన్నాడా లేక చేద్దాం కొంచెం వెయిట్ చెయ్ తరహాలో సంకేతం ఇచ్చారా అనేది పక్క వాళ్ళు లేదా లిప్ రీడింగ్ పర్ఫెక్ట్ గా తెలిసిన వాళ్ళు మాత్రమే చెప్పగలరు.
సరే వినడానికి బాగానే ఉంది కానీ ఓజి 2 తెరకెక్కడానికి మాత్రం చాలా టైం పట్టేలా ఉంది. ఎందుకంటే సుజిత్ ముందు నాని సినిమా పూర్తి చేయాలి. అదేమో ప్యారడైజ్ అయ్యాకే స్టార్ట్ అవుతుంది. ఎంతలేదన్నా ఆరేడు నెలల టైం ఉంది. ఈలోగా పవన్ రాజకీయాల్లో బిజీ అయితే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం. ఇప్పటికే అతి కష్టం మీద తీవ్ర ఒత్తిడిలో హరిహర వీరమల్లు, ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ లకు డేట్లు ఇచ్చి హమ్మయ్యా అనిపించారు. మరి ఓజికి కొనసాగింపు అంటే ఏమంటారో చూడాలి. అయితే పవన్ గత కొన్నేళ్లలో దేనికీ లేనంత ఆనందంగా, హుషారుగా ఒక్క ఓజికి మాత్రమే కనిపించారనేది నిజం.
This post was last modified on October 1, 2025 9:41 pm
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…