నిన్న హైదరాబాద్ పోలీసులు అతి పెద్ద పైరసీ నెట్ వర్క్ ని బ్రేక్ చేయడం, ఆరుకు పైగా నిందితులను అరెస్ట్ చేయడం టాలీవుడ్ ని కుదిపేసింది. పోలీస్ కమీషనర్ ఆనంద్ అధర్వంలో జరిగిన సమావేశంలో చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, నాని, రామ్ తో పాటు ఇతర అగ్ర నిర్మాతలు పాల్గొని అయన చెప్పిన విషయాలు షాకవుతూ విన్నారు. రిలీజ్ రోజే హెచ్డి ప్రింట్లు బయటికి రావడం, వాటి ద్వారా కోట్లలో వసూళ్లను పోగొట్టుకోవడం, దీని వెనుక మాఫియా ఎలా పనిచేస్తోందనే వివరాలు ఆధారాలతో సహా వీడియోలో చూపించడంతో నివ్వెరపోయి చూశారు. ఇన్నాళ్లు తమకు తెలిసింది చాలా తక్కువంటూ ఆశ్చర్యపోయారు.
తమిళనాడుకు చెందిన సిరిల్ ఇన్ఫాంట్ రాజు అనే వ్యక్తి దీనికి మూలమని కనిపెట్టిన పోలీసులు అతనికి ఏజెంట్ గా పని చేస్తున్న కిరణ్ ని పట్టుకోవడంతో ఈ డొంకంతా కదిలింది. ఇతను వనస్థలిపురం వాసి. పైరసీ ప్రింట్లను తయారు చేసి వాటిని బెట్టింగ్ యాప్స్ కి అమ్మడం ద్వారా కోట్ల రూపాయల బిజినెస్ ని తెరతీసిన ఈ గ్యాంగ్ ఇప్పటిదాకా నూటా యాభైకి పైగా సినిమాలను కేవలం రెండు మూడేళ్ళ వ్యవధిలో పైరసీ చేసింది. ఒక్క టాలీవుడ్ కే మూడు వేల కోట్లకు పైగా నష్టం వచ్చేలా చేసింది. డిజిటల్ సర్వర్లను సైతం హ్యాక్ చేసిన వీళ్ళ టెక్నాలజీ తలలు పండిన పోలీస్ పెద్దలను సైతం మాట రాకుండా చేసిందంటే అతిశయోక్తి కాదు.
ఇది ఇక్కడితో ఆగకూడదు. ఇప్పుడు వేసిన తొలిపాదం ఉక్కుపాదంలా మారాలి. ఏ పైరసీ వెబ్ సైట్స్ అయితే పోలీసులు పేర్కొన్నారో వాటిలో కొన్ని ఇప్పటికీ పని చేస్తూ ఉండటం గమనార్హం. ముందు వీటిని బ్లాక్ చేయాలి. సైబర్ క్రైమ్ రంగంలోకి దిగి వేరొకరు పైరసీ గురించి ఆలోచించాలంటేనే భయపడేలా కఠిన చర్యలు, శిక్షలకు పూనుకోవాలి. లేదంటే వీడియో క్యాసెట్ల కాలం నుంచి హెచ్డి ప్రింట్ల జమానా దాకా ఇదిలాగే కొనసాగుతూ ఉంటుంది. యువకులే ఈ నేరంలో పాలు పంచుకోవడం విషాదం. భవిష్యత్తుని కాలదన్నుకొని ఈజీ మనీ కోసం ఇలా అడ్డదారులు పట్టి సినిమా పరిశ్రమను నిలువునా ముంచేయడం దారుణం.
This post was last modified on September 30, 2025 10:51 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…