హిందీ సీరియల్స్, టీవీ షోలతో గుర్తింపు సంపాదించిన రాజస్థానీ నటి సోహానీ కుమారి కాబోయే భర్త సవాయి సింగ్ హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్‌లో సవాయ్ తన సొంత ఫ్లాట్లో ఉరి వేసుకుని చనిపోయాడు. అతడి వయసు 28 ఏళ్లు. ఫ్లాట్‌లోని డైనింగ్ ఏరియాలో అతను ఉరివేసుకుని కనిపించడంతో బయటి నుంచి వచ్చి చూసిన సోహానీ షాక్‌కు గురైంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. సోహానీ ఉత్తరాది నటే అయినా.. ఆమె హైదరాబాద్‌లోనే ఉంటోంది. కాబోయే భర్త మరణంతో ఆమె శోకసంద్రంలో మునిగిపోయింది.
ఆత్మహత్యకు ముందు సవాయి సింగ్ ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. జీవితాన్ని ముగించాలనే తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన పరిస్థితుల గురించి అందులో అతను వివరించాడు. గతంలో తాను చేసిన తప్పులే తనకు ఈ పరిస్థితి రావడానికి కారణమని అతనుపేర్కొన్నాడు. తనకంటే ముందు సవాయ్‌కి మరో యువతితో ప్రేమ వ్యవహారం ఉందని, ఆమెను మరిచిపోలేకపోవడంతో పాటు కొన్ని ఆర్థిక సమస్యల కారణంగానే అతను ఈ తీవ్ర నిర్ణయం తీసుకుని ఉంటాడని సోహానీ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం.
రాజస్థాన్‌కు చెందిన సోహానీ కుమారి, సవాయ్ సింగ్‌లకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. అది తర్వాత ప్రేమగా మారడంతో, పెద్దల అంగీకారంతో గత ఏడాది జులైలో నిశ్చితార్థం చేసుకున్నారు. అప్పటి నుంచి ఇద్దరూ కలిసి హైదరాబాద్‌లోని ప్రశాసన్ నగర్‌లోని ఒక ఫ్లాట్‌లో అద్దెకు ఉంటున్నారు. త్వరలో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నారు. ఇంతలో సవాయ్ ఆత్మహత్యకు పాల్పడడం సోహానీకి షాక్. సోహానీ కుమారి హిందీ సీరియల్స్ ద్వారా నటిగా పేరు సంపాదించింది. వాటిలో ‘యే హై చాహతే’ సీరియల్ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. సోహానీ ఇటీవలే నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. ‘ప్యార్ టెస్టింగ్స పేరుతో ఆమె ఒక సిరీస్ నిర్మిస్తోంది.
This post was last modified on September 30, 2025 7:15 am
సినిమా లవర్స్‌కు సినిమా తెర వెనుక సంగతుల మీద కూడా అమితాసక్తి ఉంటుంది. ఘనవిజయం సాధించిన సినిమాలకు సంబంధించి మేకింగ్…
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న దాదా షూటింగ్ ఇంకా రీ స్టార్ట్ కాలేదు. బాలయ్య ఇప్పుడిప్పుడే…
ఈ రోజుల్లో చెప్పిన రిలీజ్ డేట్‌కు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ బాగా తగ్గిపోయారు. కాస్త పేరున్న సినిమా…
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి కీలకంగా మారిన మూడు మునిసిపల్ కార్పొరేషన్ల వ్యవహారం.. ఆసక్తిగా మారింది. రాజకీయ వర్గాల్లోనే కాదు..…
సాంకేతిక రంగంలో పెను విప్లవానికి దారి తీస్తున్న ఏఐ ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాకముందే ప్రపంచాన్ని హడలెత్తిస్తుంది. అణ్వాయుధాల కంటే…
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ రూటు మాసరుస్తున్నారా..? నిన్నా మొన్నటి వరకు ప్రధాని మోదీకి నమ్మకమైన వ్యక్తిగా కొనసాగిన…