బిగ్ బి అమితాబ్ బచ్చన్ కెరీర్లో ఎన్నో విలక్షణమైన పాత్రలు చేశాడు. ముఖ్యంగా హీరో వేషాలు పక్కన పెట్టేశాక అమితాబ్‌ను ఎన్నో విభిన్న పాత్రల్లో, కొత్త అవతారాల్లో చూశాం. సినిమాకు సినిమాకు పొంతన లేని ఆయన లుక్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఐతే నటుడిగా కానీ, హీరోగా కానీ.. అమితాబ్‌కు దరిదాపుల్లోకి కూడా రాలేకపోయాడు ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్.
మణిరత్నం దర్శకత్వంలో చేసిన ‘గురు’ను మినహాయిస్తే లుక్స్, యాక్టింగ్ పరంగా అభిషేక్ పెద్దగా వైవిధ్యం చూపించలేకపోయాడు. ఇటు నటుడిగా పేరు రాలేదు, అటు బాక్సాఫీస్ సక్సెస్ కూడా అంతంతమాత్రమే. దీంతో అతడి కెరీర్ ఆశించిన వేగంతో నడవట్లేదు. ఇలాంటి తరుణంలో ఒక వైవిధ్యమైన సినిమాతో ప్రయోగానికి సిద్ధమవుతున్నాడు అభిషేక్.
జూనియర్ బచ్చన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా.. బాబ్ బిశ్వాస్. దివ్య అన్నపూర్ణ ఘోష్ ఈ చిత్రానికి దర్శకురాలు. షారుఖ్ ఖాన్, సుజాయ్ ఘోష్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. ఇందులో అభిషేక్ సరసన చిత్రాంగద సింగ్ నటిస్తోంది. ఈ సినిమా కోసం అభిషేక్ సరికొత్త అవతారంలోకి మారాడు. మిడిల్ ఏజ్డ్ మ్యాన్‌గా గుర్తు పట్టలేని లుక్‌లోకి వెళ్లిపోయాడు అభిషేక్. అతడి హేర్ స్టైల్ పూర్తిగా మారిపోయింది.
తల మధ్యలో జుట్టు నెరిసి, కొంచెం బట్టతల వచ్చి అసలు సిసలై నడి వయస్కుడిగా కనిపిస్తున్నాడు అభిషేక్. అలాగే కొంచెం బరువు పెరగడంతో పాటు కొంచెం మేకప్‌తోనూ మెరుగులు దిద్దడంతో ‘అంకుల్’ లుక్‌కు బాగా సెట్ అయ్యాడు. డ్రెస్సింగ్ కూడా బాగా కుదిరింది. మొత్తంగా చూడగానే వావ్ అనిపించేలా సరికొత్త అవతారంలోకి మారిపోయాడు అభిషేక్. ఈ లుక్‌కు సంబంధించిన ఫొటోలు ట్విట్టర్లో వైరల్ అవుతున్నాయి.
This post was last modified on November 26, 2020 4:38 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…