ప్రభాస్ మొదటిసారి హారర్ జానర్ చేసిన ది రాజా సాబ్ జనవరి 9 విడుదలకు రెడీ అవుతోంది. కొత్త డేట్ ఎప్పుడో లీకైనప్పటికీ అఫీషియల్ గా బయటికి వచ్చింది మాత్రం కొత్త ట్రైలర్ రూపంలోనే. టీజర్ నే మూడు నిముషాలు చూపించిన దర్శకుడు మారుతీ ఈసారి ఇంకో అరనిమిషం అదనంగా మరో కంటెంట్ ఇవ్వడంతో అభిమానులు ఆశ్చర్యంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చాలా గ్యాప్ తర్వాత సంక్రాంతి బరిలో డార్లింగ్ ఉండటంతో బిజినెస్ పరంగా అంచనాలు ఎక్కువ కాబోతున్నాయి. అయితే టీజర్ తో పోలిక లేకుండా ఇప్పుడీ వీడియోలో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ చూపించిన మారుతీ స్వీట్ షాక్ ఇచ్చారు.
కథాపరంగా ఇంకొన్ని అంశాలు వివరించారు. చనిపోయిన తాత (సంజయ్ దత్) తమ ఆస్తిగా ఉన్న పెద్ద బంగాళాలో మకాం వేసి ఎవరినీ రానివ్వకుండా చేస్తున్నాడని గుర్తించిన మనవడు (ప్రభాస్) కొందరు మిత్రుల సహకారంతో అక్కడికి వెళ్తాడు. చేతబడి చేసే వాళ్ళ సహాయం తీసుకుంటాడు. కానీ అనుకున్నంత తేలిగ్గా అక్కడి వ్యవహారం ఉండదు. ప్రేమించిన అమ్మాయిలతో పాటు తను కూడా ప్రమాదంలో ఇరుక్కుంటాడు. దెయ్యాలు, భూతాలే కాదు విచిత్ర జంతువులు, మొసళ్ళు, పాములు, ఏనుగులు ఇలా పెద్ద సెటప్ ఉంటుంది. ఒక రాక్షసుడు (ప్రభాస్) కూడా ఉంటాడు. అదేంటనేది తెరమీద చూడాలి.
కెరీర్ లో మొదటిసారి ప్రభాస్ ని రెండు పాత్రల్లో చూపిస్తున్న మారుతీ ఈసారి క్లాస్, మాస్ రెండు మిక్స్ చేయడం విశేషం. విజువల్స్ బాగున్నాయి. మిరాయ్ కన్నా నాణ్యత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా పిల్లలను టార్గెట్ చేసుకున్న మారుతీ వాళ్లకు హాలీవుడ్ రేంజ్ ఫీలింగ్ అయితే తెప్పించేలా ఉన్నాడు. పేరుకి హారర్ అయినప్పటికీ కమర్షియల్ సినిమాలో ఉండాల్సిన అన్ని హంగులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వింటేజ్ ప్రభాస్ ని ఫ్యాన్స్ మళ్ళీ మళ్ళీ చూసుకుని మురిసిపోయేలా ఉన్నాడు. తమన్ నేపధ్య సంగీతంతో పాటు ఇతర టెక్నికల్ హంగులు బాగా కుదిరాయి. ఇంతకన్నా అభిమానులు కోరుకునేది ఏముంటుంది.
This post was last modified on September 29, 2025 6:24 pm
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…