సినీ కటుంబాలకు చెందిన వాళ్లు.. ఈ ఇండస్ట్రీని కాదనుకుని వేరే రంగాల వైపు వెళ్లడం ఇప్పుడు అరుదు. ఇక్కడ సక్సెస్ రేట్ చాలా తక్కువైనా సరే.. వారసులు ఇందులోకే వస్తుంటారు. హీరోల కొడుకులు హీరోలవడం చాలా కామన్. ఒకప్పటితో పోలిస్తే అమ్మాయిలు కూడా నటన వైపు ఎక్కువగానే వస్తున్నారు. ఐతే సినిమాకు సంబంధించి అత్యంత కష్టమైన వ్యవహారం అయిన దర్శకత్వం చేయడం అంటే అంత తేలికైన విషయం కాదు.
దానికి అసాధారణ నైపుణ్యం ఉండాలి, అలాగే ఎంతో కసరత్తూ చేయాలి. మరి ఆ నైపుణ్యాలు ఉండి, కసరత్తు కూడా చేసినట్లే కనిపిస్తోంది తమిళ స్టార్లు సూర్య, జ్యోతికల ముద్దుల కూతురు దియ. అమ్మా నాన్నల సినీ వారసత్వాన్ని స్వీకరించిన ఈ అమ్మాయి 17 ఏళ్లకే డైరెక్టర్ అయిపోయింది. కాకపోతే తొలి ప్రయత్నంగా ఆమె తీసింది ఫీచర్ ఫిలిం మాత్రం కాదు. అదొక డాక్యుమెంట్ డ్రామా.
‘లీడింగ్ లైట్’ పేరుతో 13 నిమిషాల డాక్యుమెంట్ డ్రామాను దియా రూపొందించింది. ఈ డాక్యుమెంటరీ 24 సినిమా క్రాఫ్ట్స్‌లోని ఒక ప్రత్యేక విభాగం గురించి కావడం విశేషం. ఒక సినిమా తెరకెక్కడం వెనుక ప్రతి విభాగం కష్టం ఎంతో ఉంటుంది. అందులో లైటింగ్ పాత్ర ఎంతో కీలకం. ఇందులో ఎక్కువగా మగవాళ్లే పని చేస్తారు. ఈ విభాగంలో ముగ్గురు మహిళలు అడుగు పెట్టి ఎలా సక్సెస్ అయ్యారనే పాయింట్ మీద ‘లీడింగ్ లైట్’ డాక్యుడ్రామాను రూపొందించింది దియా.
సూర్య, జ్యోతికల సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్టైన్మెంట్స్ దీన్ని ప్రొడ్యూస్ చేసింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఆస్కార్ క్వాలిఫయింగ్ రన్‌లో భాగంగా ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించడం విశేషం. అక్కడ దీనికి విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. వచ్చే సంవత్సరానికి అకాడమీ అవార్డుల్లో డాక్యుమెంటరీ విభాగంలో ‘లీడింగ్ లైట్’ పోటీ పడే అవకాశాలున్నాయి. భవిష్యత్తులో దియా ఫీచర్ ఫిలిం డైరెక్టర్ కావడం లాంఛనమే అంటున్నారు.
This post was last modified on September 29, 2025 2:39 pm
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రాజకీయాలు కూటమిలోనే అంతర్గత వివాదాలకు కేంద్రంగా మారుతోంది. ఈ నియోజకవర్గం పూర్తిగా పట్టణ పరిధిలో ఉంది.…
ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త ప్రచారం వెంకటేష్ అభిమానులను టెన్షన్ కు గురి చేస్తోంది. అక్టోబర్ 2 నుంచి ఆల్రెడీ…
దానం నాగేందర్‌పై వేటు పడడం.. ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావడం.. ఇటీవల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…
శ్రీకాంత్ ఓదెల.. ఈ పేరు చెప్పగానే అందరికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…
నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…
నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…